అదేంటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి చిట్కాలు కూడా ఇస్తున్నాడా..? అంటూ ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ గోపాల్ వర్మ ఆయన ఆలోచన తీరే సెపరేటు..
అదేంటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి చిట్కాలు కూడా ఇస్తున్నాడా..? అంటూ ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ గోపాల్ వర్మఆయన ఆలోచన తీరే సెపరేటు.. వర్మ సలహా అయితే ఇస్తున్నాడు..
అదేంటంటే.. ''మీకెప్పుడైనా ఒంటరిగా అనిపించి.. నా వెనుక ఎవరూ లేరనే ఫీలింగ్ కలిగిందనుకోండి.. వెంటనే హారర్ సినిమా చూడండి. మీ ఒంటరి తనం మాయమైపోయి.. మీ వెనుక ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది'' అంటూ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడే వర్మ ఇప్పుడు ఒంటరితనం నుండి ఎలా బయటపడాలో తన స్టైల్ లో చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
Scroll to load tweet…
