రాంగోపాల్ వర్మ అందరిలాంటి మనిషి కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అతడికి సెంటిమెంట్స్, ఎమోషన్స్ లాంటివి ఉండవని అభిప్రాయ పడుతుంటారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వర్మ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్థించుకునే నైపుణ్యం కూడా వర్మ దగ్గర ఉంది.
అయితే రాంగోపాల్ వర్మ అందరిలాంటి మనిషి కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అతడికి సెంటిమెంట్స్, ఎమోషన్స్ లాంటివి ఉండవని అభిప్రాయ పడుతుంటారు. అయితే వర్మ సోదరి విజయ లక్ష్మి రాఖీ పండుగ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలని పంచుకున్నారు.
రాంగోపాల్ వర్మకి కూడా సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఉంటాయట. కానీ అవి అందరిలాగా కాదని తెలిపింది. తన పనులకు ఆటంకం కలిగించే సెంటిమెంట్స్ ని వర్మ ఫాలో కాదట. రాఖీ పండుగ అంటే వర్మతో నాకు విచిత్రమైన అనుభవాలు ఉన్నాయని విజయ లక్ష్మి అన్నారు.

రాఖి కడతాను చేయి ఇవ్వు అంటే ఖచ్చితంగా తిడతారు. అదే అయన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా వెళ్లి రాఖి కడితే ఆ తర్వాత చూసుకుని థ్రిల్ అవుతారు. అదే కాసేపు ఫోన్ పక్కన పెట్టు రాఖీ కడతాను అని అంటే మాత్రం ఒప్పుకోరు. తన పనికి ఆటకం కలిగించకుండా ఏమైనా చేయొచ్చు అని విజయ లక్ష్మి అన్నారు.
రాఖీ కట్టడానికి వర్మ చేయి దొరికితే చాలా అదే పెద్ద గిఫ్ట్ ఆయన ప్రత్యేకంగా గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని విజయలక్ష్మి తెలిపారు. కాలేజీలో ఒక అబ్బాయి నా వెంటపడుతుంటే వర్మ అతడిని చితకబాదాడని విజయలక్ష్మి గుర్తు చేసుకున్నారు.
