తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధీష్టానం నిర్ణయించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో ఓ సెటైరికల్‌ ట్వీట్‌ వదిలాడు.

వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లు సెటైరికల్‌గా, చిత్ర విచిత్రంగా ఉంటాయి. అర్థమయ్యే వాళ్లకి ఒకలా, అర్థం కాని వారికి మరోలా, ఆయన అంటే నచ్చే వారికి పాజిటివ్‌గా, నచ్చని వారికి నెగటివ్‌గా ఉంటాయి. కానీ చాలా వరకు తనదైన స్టయిల్‌లో సెటైరికల్‌గా స్పందించడం వర్మ స్టయిల్‌. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధీష్టానం నిర్ణయించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొంత వరకు ఆనందం, మేజారిటీ నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. 

ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో ఓ సెటైరికల్‌ ట్వీట్‌ వదిలాడు. రేవంత్‌రెడ్డిని సింహంతో పోల్చాడు. ఇతర నాయకుల్ని టైగర్స్ తో పోల్చాడు. కాంగ్రెస్‌ పార్టీ సూపర్‌ ఫెంటాస్టిక్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆయన చెబుతూ, `లయన్‌ రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఖరారు చేసి కాంగ్రెస్‌ పార్టీ చివరగా సూపర్‌ ఫెంటాస్టిక్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టైగర్స్ అన్ని సింహాన్ని చూసి భయపడతాయి` అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…