Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ నా పోస్టర్ ను కాపీ కొట్టాడు, రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్..

మరో్సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఛాన్స్ దొరికితే చాలు జనసేనానిపై సెటైర్లే వేసే ఆర్జీవి.. ఈసారి కూడా పవన్ పై.. వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 

Ram Gopal Varma Satirical Tweet On Power Star Pawan Kalyan JMS
Author
First Published Sep 10, 2023, 8:29 PM IST


వివాదాలతో ఆడుకోవడం సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా అలవాటు. తనకు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. ఓ ఆట ఆడుకోవాలి అని చూస్తాడు ఆర్జీవి. ఇక ఈమధ్య రాజకీయంగా చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు వర్మ. ఏ పార్టీలో చేరకపోయినా.. రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జగన్ ను సపోర్ట్ చేస్తూ.. చంద్రబాబును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు ఆర్జీవి. పవర్ స్టార్ పై సెటైర్ వేసే ఏ సందర్భాన్ని ఆయన వదిలిపెట్టడం లేదు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేసిన పనిపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. 

చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం అట్టుడికిపోతున్న క్రమంలో.. ఆయనకు మద్దతుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి బాబును పరామర్శించాలి అనుకున్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ ను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కోపంతో ఊగిపోయిన జనసేనాని పోలీసులపై నిరసన వ్యాక్తం చేశారు. నడి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన పవర్ స్టార్.. ఆతరువా కొద్దిసేపు రోడ్డుమీద కూర్చోని.. ఆతరువాత కారుపై కూర్చిని నిరసన తెలిపారు. ఇక పోలీసులు పవర్ స్టార్ ను అదుపులోకి తీసుకుని తరలించడం అంతా జరిగిపోయింది. ఇక ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ తన టాలెంట్ చూపించాడు. పవర్ స్టార్ పై సెటైర్లు పేలుస్తూ.. ట్వీట్ చేశాడు. 

 

అయితే రోడ్డు మీద పవర్ స్టార్ కాలు మీద కాలు వేసుకుని పడుకున్న ఫోటోను వర్మ ట్వీట్ చేస్తూ.. తాను వ్యూహం సినిమా కోసం రిలీజ్ చేసిన పవర్ స్టార్ ఫోటోను కూడా కలిపి షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ తన పోస్టర్ ను కాఫీ కొట్టాడు అనే అర్ధం వచ్చేట్టుగా ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఆర్జీవి. ఆయన్ ట్వీట్ చేస్తూ... నేను నెలకింద వ్యూహం సినిమాలో రిలీజ్ చేసిన ఫోటో.. కింద రియల్ ఫోటో అంటూ పవను వెక్కిరిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఆర్జీవి. దాంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరెండు ఫోటోలలో పవర్ స్టార్ కాలు మీద కాలు వేసకుని పడుకుని ఉన్నారు. 

 

ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ జగన్ సపోర్ట్ గా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాు. ఫ్యూహం టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా వైఎస్ జగన్ బయోపిక్ మూవీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో జగన్ పాదయాత్ర, సీఎం అవ్వడం. మధ్యలో ఏర్పడ్డ అడ్డంకులు ఇలాంటి విషయాలను టచ్ చేస్తూ ఆయన సినిమా చేస్తున్నారు. ఈసినిమాలో పవర్ స్టార్ తో పాటు చంద్రబాబును కూడా విలన్లుగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్ వీడియోస్, స్పెషల్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ఎలా ఉంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios