Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవీ ఆ శారీ గర్ల్ ను వదిలేలా లేడుగా... ఇంతకీ ఆమె ఎవరు? షాకింగ్ డిటెయిల్స్

రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మాయి గురించి వెతుకుతున్న విషయం తెలిసిందే. చీరకట్టులో సోషల్ మీడియాలో మెరిసిన ఆమె గురించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

Ram Gopal Varma Saree Girl Sri Lakshmi Satish Details NSK
Author
First Published Oct 5, 2023, 3:48 PM IST

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  తన పోస్టులతో క్షణాల్లో నెటిజన్ల అటెన్షన్ డ్రా చేస్తుంటారు. ఆసక్తికరమైన ట్వీట్లు, పోస్టులతో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంటారు. అయితే ఆర్జీవీ సినిమాలు, ఇటీవల పొటికట్ గానూ ఎంత ఆసక్తి చూపిస్తున్నారో.. మరోవైపు అమ్మాయిలను పాపులర్ చేయడంలోనూ ముందుంటున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ ఇన్ స్టాలో చీరకట్టులో ఉన్న ఓఅమ్మాయి ఫొటోలను పోస్టు చేస్తూనే వస్తున్నారు. నాలుగు రోజుల కింద ఆ అమ్మాయి ఎవరంటూ ఫస్ట్ పోస్ట్ చేసిన ఆర్జీవీ ఇప్పటికీ ఆమెను పొగుడుతూనే వస్తున్నారు.  

ఆమె లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చీరకట్టులోని మరో ఫొటోలను షేర్ చేశారు. బ్యూటీఫుల్ అంటూ ఆమె అందాన్ని పొగిడారు. దీంతో ఆమె స్పందించే వరకు వదిలేలా లేడే అంటూ నెటిజన్లు పంచులు పేల్చుతున్నారు. ఏదేమైనా ఆ చీర అమ్మాయి మాత్రం ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

ఆర్జీవీ ముద్దుగా శారీ గర్ల్ అనే పిలుచుకునే ఆమె పేరు శ్రీ లక్ష్మి సతీష్ (sri Lakshmi Satish) . మలయాళీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎత్తు 5.8. వయస్సు 22 ఏళ్లు మాత్రమేనని రీసెంట్ గా ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ వెల్లడించింది. రీసెంట్ గానే ఆమె ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ చేసినట్టు చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 28న ఆమె పుట్టిన రోజు అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఆమె చాట్ నెట్టింట వైరల్ గా మారింది. 

అయితే, ఆర్జీవీ ఆమెతో ‘చీర’ అనే సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడంట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పింది. కానీ ఇంకా కథ చెప్పలేదని వెల్లడించింది. ప్రస్తుతం తన లైఫ్ స్టైల్  బాగానే ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇక తన ఇన్స్టా పై ఫార్పల్లా అని ఉండటంపైనా క్లారిటీ ఇచ్చింది.. అది ఇటాలియన్ పదమని... సీతాకోక చిలుక దాని అర్థం అంటూ చెప్పింది. ఇక ఆర్జీవీ ఆమె పోస్టులను రీట్వీట్ చేయడం ఫాలోవర్స్  కూడా పెరిగిపోతున్నారంట. తాజాగా ఆమె లేటెస్ట్ ఫొటోను కూడా ఆర్జీవీ పంచుకున్నారు. ఇక గతంలో ఆర్జీవీ కామెంట్స్, ఇంటర్వ్యూలతో అరియానా గ్లోరీ, అషురెడ్డి సెలబ్రెటీలుగా మారిపోయిన విషయం తెలిసిందే. 


 

Ram Gopal Varma Saree Girl Sri Lakshmi Satish Details NSK

Follow Us:
Download App:
  • android
  • ios