ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడో వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా చోట్ల ఎక్కడైనా ఈ సినిమా రిలీజ్ కావచ్చు. అదే జరుగుతోంది ఈ రోజు. ఇప్పటికే యుఎస్ లో షోలు పడిపోయాయి. 

యుఎస్ షో లు చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటల్ కార్డ్ లోనే జనాల ఎటెన్షన్ ని గ్రాబ్ చేసారు. ‘ధాంక్స్ టు బాలయ్య’ అనే కార్డ్ వేసారు. అది చూసిన జనం ధియోటర్ లో ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే మోహన్ బాబు పాత్రకు సైతం సినిమా లో ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. 

మోహన్ బాబు వచ్చి ఎన్టీఆర్ ని కలిసి తనతో ఓ సినిమా చేయమని అడగటం...అలా మేజర్ చంద్రకాంత్ చిత్రం బయిటకు రావటం జరుగుతుంది. అయితే మోహన్ బాబు క్యారక్టర్ గెటప్, క్యారక్టరైజేషన్, డైలాగ్స్ చెప్పే విధానం ఇవి కొంచెం విచిత్రంగా అనిపించి, జనాలు నవ్వుతున్నారు. 

ఇక చిత్రం రిలిజ్ విషయానికి వస్తే... మంగళగిరి కోర్టు ఇచ్చిన స్టే పై స్పందించిన ఏపీ హైకోర్టు సినిమాను ఏప్రిల్ మూడు వరకూ విడుదల చేయరాదని ఆదేశించింది.ఈ నేపధ్యంలో ఆంధ్రలో ఈ చిత్రం రిలీజ్ కావటం లేదు. 

మరో ప్రక్క  తెలంగాణలో సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కూడా సినిమా విడుదలపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అనుకున్నట్లుగానే మార్చి 29 ఈ శుక్రవారం ఈ సినిమాను తెలంగాణా ఏపీలో చిత్ర విడుదలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు