వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. తనపైన తానే సినిమా తీసుకుంటున్నాడు. అయితే అది బయోపిక్‌ కాదు. తాను తప్పిపోయినట్టు చెబుతూ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

`ఆర్‌జీవీ మిస్సింగ్‌` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రామ్‌గోపాల్‌ వర్మ కనిపించడం లేదనే కోణంలో, ఆర్జీవీ కిడ్నాప్‌ అయ్యారనే కథాంశంతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే వర్మ కనిపించకపోవడానికి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, ఆయన కుమారుడిని సస్పెక్ట్ గా చూపిస్తున్నారు. 

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌పై `పవర్‌స్టార్‌` సినిమా తీసి వివాదం చేశాడు వర్మ. ఇప్పుడు తన మిస్సింగ్‌ అంటూ మరో వివాదానికి తెరలేపాడు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ ని, ఆయన అభిమానులను, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు లోకేష్‌ని అనుమానితులుగా చెప్పడం మరింత వివాదాస్పదంగా మారింది. 

తాజాగా ఈ ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ఇందులో వర్మ బేడీలతో కనిపించడం విశేషం. అంతేకాదు అమాయకమైన బాధితుడు అని పేర్కొనడం మరింత ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి అదిర్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, కేవీ ప్రొడక్షన్స్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.