సినీ తార శ్రీదేవి మృతిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవుడ్ని ఈ రోజు ద్వేషించినంతగా ఏ రోజూ ద్వేషించలేదని అన్నారు. శ్రీదేవిని తన ఆరాధ్య దేవతగా ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. శ్రీదేవిని వివాహం చేసుకున్న బోనీకపూర్ అంటే నతకు చాలా కోపమని కూడా ఆయన హాస్యమాడిన సందర్భాలున్నాయి. శ్రీదేవి మరణవార్త వినగానే ఆయన ట్విట్టర్‌లో తన ప్రతిస్పందనను రాశారు.ఈ రోజు దేవుడిని ద్వేషించినంతగా మరో రోజూ ద్వేషించలేదని, ఉజ్వలమైన వెలుగు ఆర్పేశాడని, బోనీ కపూర్‌కు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
ప్రతీ సినిమా తనపై ప్రభావం చూపుతుందని చెప్పే రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం సినిమా విషయంలో తనపై శ్రీదేవి ఎంతో ప్రభావం వేసిందని రామ్ గోపాల్ వర్మ ఓ సందర్భంలో అన్నారు.
రెండో సారి కూడా తాను షాట్ ఓకే అన్నానని, డ్యాన్స్ మాస్టర్ మళ్లీ వన్ మోర్ అన్నారని, అప్పుడు సహాయ దర్శకుడు నాగేశ్వర రావును పిలిచి అంతా బాగానే ఉంది కదా, ఎందుకు వన్ మోర్ అంటున్నాడని తాను అడిగానని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
రామూ! నువ్వు శ్రీదేవిని చూస్తున్నావు డ్యాన్స్ మాస్టర్ వెంకటేష్‌ను చూస్తున్నారు అన్నాడని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఆ షాట్ తీసేటప్పుడు శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయానని వర్మ చెప్పారు. సినిమాలు, శ్రీదేవి తనకు రెండు కళ్లు అని, ఆ రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయని రామ్ గోపాల్ వర్మ అన్నారు.