సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

వాస్తవాలతో ఈ సినిమాను తెరకెక్కించారని, కచ్చితంగా ఈ సినిమా చూడాలని ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు. జనాల్లో ఈ సినిమాకు పెరిగిన క్రేజ్ కారణంగా సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. భారీ మొత్తాలకు ఈ సినిమాను అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి.  వీటిపై స్పందించిన వర్మ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. 

''లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబంధించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి  కొనుక్కున్నారు  అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు... ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు  Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు'' అంటూ 
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మార్చి 15న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.