Asianet News TeluguAsianet News Telugu

అష్షు రెడ్డి బర్త్ డే లో రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ బ్యూటీ చేయి పట్టుకుని...?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రచ్చ రచ్చ చేశారు. అది కూడా ఏ స్టార్ ఈవెంట్ లోనే కాదు. బిగ్ బాస్ బ్యూటీ.. బుల్లి తెర నటి అష్షు రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో. అంత స్టార్ డైరెక్టర్ ఈ చిన్న ఫంక్షన్ కు రావడం.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.  

Ram Gopal Varma on Ashu Reddy Birthday Event
Author
First Published Sep 16, 2022, 2:23 PM IST

తన బర్త్ డే పార్టీకి స్టార్ సినియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పిలిచి హాట్ టాపిక్ అయ్యింది అషురెడ్డి. ఆమె పిలవడం.. ఆర్జీవి వచ్చి అక్కడ సందడి చేయడం అంతటా చర్చనీయాంశం అవుతోంది.  తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అష్షు రెడ్డి. జూనియర్ సయంతగా బాగా పాపులర్ అయిన ఈ నటి..  తన గ్లామర్, నటనతో  పాటు.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో  అందరిని ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి రెండు సార్లు వెళ్ళి వచ్చి.. మరింత పాపులారిటీని పెంచుకుంది బ్యూటీ. 

ఇక  సోషల్ మీడియాలో అష్షు వేసే వేశాలు మామూలుగా ఉండవు. ఫాలోవర్స్ ను పెంచుకునే క్రమంలో.. హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తూ.. అద్భుతాలు చేస్తోంది అష్షు రెడ్డి. తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు గుచ్చుతోంది. ఇక ఆ మధ్య  ఆర్జీవీని  ఇంటర్వ్యూ చేసి అషు బాగా ఫేమస్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయాలంటే ధైర్యం ఉండాలి. ఆయన వేసే పంచ్ లను తట్టుకోగలిగి ఉండాలి. ఇక ఆర్జీవీ తో అషు చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో ఫుల్ వైరల్ అయింది. తాజాగా మరోసారి వీరిద్దరు రచ్చ రచ్చ చేశారు. 

సెప్టెంబర్ 15 న అష్షు రెడ్డి బర్త్ డే సందర్భంగా  సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి  స్టార్ డైరెక్టర్ ఆర్జీవి హాజరయ్యారు..అంతే కాదు అషుతో కలసి ఆయన రచ్చ రచ్చ చేశారు. ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన  రామ్ గోపాల్ వర్మ తనమార్క్  స్టైల్  చూపించారు. అషు రెడ్డి చేతిని పట్టుకుని కేక్ కట్ బిగ్ బాస్ ఫేమ్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. ఈ  వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

అషు రెడ్డి టిక్ టాక్.. డబ్ ష్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. జూనియర్ సమంతగా  సోషల్ మీడియాలతో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ , ప్రైవేట్ సాంగ్స్ తో మంచి పాపులారిటి సొంతం చేసుకుంది. బిగ్ బాస్  హౌస్ కు ఎప్పుడైతే వెళ్లిందో అప్పటి నుంచీ ఆమె  లైఫ్ కంప్లపీట్ గా  మారిపోయింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత వరుసగా టీవీ షోలు చేస్తూ.. బుల్లితెర స్టార్ గా ఫుల్ బిజీ అయిపోయింది. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటోంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. 

ఇక తన హోయలతో సోషల్ మీడియాను హిటేక్కించడంలో  అష్షు రూటే సెపరేటు. రీసెంట్ గా వెకేషన్ కోసం ఫారెన్ వెళ్లి వచ్చింది అష్షు రెడ్డి. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి నుంచి  ఖరీదైన కారును బహుమతిగా పొందింది.  ప్రస్తుతం వరుస ఫ్రోగ్రామ్స్ తో పాటు.. సోషల్ మీడియా ద్వారా కూడా ఫుల్ గా సంపాధిస్తోంది బ్యూటీ. తోటి హౌస్ మెంట్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో మునిగి తేలుతుంది అన్న రూమర్స్ కూడా ఉన్నాయి ఇండస్ట్రీలో. 

Follow Us:
Download App:
  • android
  • ios