సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో సినిమాను ప్రకటించాడు. లాక్‌ డౌన్‌ కారణంగా మిగతా దర్శకులంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుసగా సినిమాలు రెడీ చేస్తూ పోతున్నాడు. ఇటీవల ఓటీటీలో క్లైమాక్స్‌ పేరుతో ఓ హాట్‌ సినిమాను రిలీజ్ చేసిన వర్మ, ఈ నెల 27న నేక్డ్‌ పేరుతో సెమీ పోర్న్ సినిమాను వదులుతున్నాడు. వీటితో పాటు కరోనా వైరస్‌ పేరుతో మరో సినిమాను రెడీ చేస్తున్నాడు.

ఇవి కాక ద మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంథీ, కిడ్నాపింగ్ ఆఫ్‌ కత్రినా కైఫ్‌ అనే సినిమాలను కూడా ప్రకటించాడు వర్మ. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను ఎనౌన్స్ చేశాడు ఆర్జీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య, అమృత ప్రణయ్‌ల ప్రేమ కథల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ రోజు ఫాధర్స్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు.

మర్డర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కుటుంబ కథా చిత్రమ్ అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమాతో ఆనంద్‌ చంద్ర అనే మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. నట్టీస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాణంలో అనురాగ్‌ కంచర్ల సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రివీల్ చేశాడు వర్మ.