Asianet News TeluguAsianet News Telugu

అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.. థియేటర్‌లో మర్డర్ ః రామ్‌గోపాల్‌ వర్మ

తాజాగా సెన్సార్‌ బోర్డ్ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా విడుదలకు సంబంధించిన `సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్`ను ఆయన పోస్ట్‌ చేశారు. అదే విధంగా `మర్డర్‌ మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలిగిపో​యాయి. థియేటర్లలో చంపేందుకు `మర్డర్‌` సినిమా త్వరలోనే రాబోతుందని తెలిపారు. 

ram gopal varma marder movie will be release 18th december  arj
Author
Hyderabad, First Published Dec 8, 2020, 3:52 PM IST

`ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. థియేటర్లలో చంపడానికి `మర్డర్‌` సినిమా త్వరలోనే రాబోతుంది` అని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన రూపొందించిన చిత్రం `మర్డర్‌`. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాని మారుతిరావు కోణంలో తెరకెక్కించారని `మర్డర్‌` సినిమాని నిలిపివేయాలని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి నల్గొండ జిల్లా కోర్ట్ ని ఆశ్రయించారు. 

మరోవైపు తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్‌ మూవీని నిర్మించాడని ట్రైలర్‌, పాటలో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించాడని ఆమృత తీవ్ర అభ్యత్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన కోర్ట్ సినిమా విడుదలపై స్టే, దాన్ని వర్మ టీమ్‌ సవాల్‌ చేస్తూ హైకోర్ట్ ని ఆశ్రయించగా పలు కండీషన్స్ తో విడుదలకు అనుమతినిచ్చింది. 

తాజాగా సెన్సార్‌ బోర్డ్ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా విడుదలకు సంబంధించిన `సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్`ను ఆయన పోస్ట్‌ చేశారు. అదే విధంగా `మర్డర్‌` మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలిగిపో​యాయి. థియేటర్లలో చంపేందుకు `మర్డర్‌` సినిమా త్వరలోనే రాబోతుందని తెలిపారు. అయితే ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్టు వర్మ ప్రకటించారు. 

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, పాట అభిమానులను ఆకట్టుకున్నాయి. విడుదలైన ఆ పాటను ఆర్జీవీ పాడటం విశేషం. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించారు. 

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...`ఇది కుటుంబ కథా చిత్రం. సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఏ సట్టిఫికెట్ పొందింది. ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నామ`ని తెలిపారు. 

నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, `న్యాయం గెలుస్తుందని మేము మొదటినుండి చెబుతూ ఉన్నాము. `మర్డర్‌` సినిమా విడుదల కాకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. చివరికి మాకు న్యాయం జరిగింది. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసినది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఈ మూవీ ఉండబోతొంద`ని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios