Asianet News TeluguAsianet News Telugu

వర్మ మరో అరాచకం.. ఇద్దరమ్మాయితో రచ్చ? బోల్డ్ గా ట్రైలర్ రిలీజ్


పురుషుల మీద ద్వేషంతో ఒకరిని ఒకరు ప్రేమించుకునే యువతుల పాత్రల్లో నైనా గంగూలీ, అప్సరా రాణి కనిపించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు యూత్‌ను ఆకట్టుకునే విధంగా
ఉన్నాయి. 

Ram Gopal Varma Maa Ishtam Dangerous New Trailer Released
Author
First Published Nov 20, 2022, 11:13 AM IST

 
తన మాటల ద్వారానో, సినిమాల ద్వారానో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూంటారు రామ్‌ గోపాల్‌ వర్మ. ఆయన తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘డేంజరస్‌’(తెలుగులో ‘మా ఇష్టం’) . గతంలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ‘లెస్బియన్‌ నేపథ్యం కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు విడుదలకు రంగం చేస్తున్నారు.  ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీన దీన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సారైనా విడుదల అవుతుందా? లేకపోతే మళ్లీ వాయిదా పడుతుందా అన్నది చూడాలి.ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసారు. 
 
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’.  అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదల కాబోతోంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్‌ అంశాలతో క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘మా ఇష్టం - డేంజరస్’కు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. 

పురుషుల మీద ద్వేషంతో ఒకరిని ఒకరు ప్రేమించుకునే యువతుల పాత్రల్లో నైనా గంగూలీ, అప్సరా రాణి కనిపించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు యూత్‌ను ఆకట్టుకునే విధంగా
ఉన్నాయి. దీంతోపాటు రూ.2 కోట్ల క్యాష్, క్రైమ్‌కు సంబంధించిన అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఒక మాఫియా గ్యాంగ్ వీరిని తరమడం, వారి నుంచి వీరు తప్పించుకోవడానికి
ప్రయత్నించడం వంటి సీన్లు కూడా ట్రైలర్‌లో చూడవచ్చు.

ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్/యాక్షన్ సినిమాగా 'డేంజరస్' విడుదల కాబోతుంది.  మొదటి నుంచి కూడా ఇద్దరి అమ్మాయిల రొమాన్స్ ను హైలైట్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల
చేశారు వర్మ. ట్రైలర్ ను కూడా ఎంతో బోల్డ్ గా కట్ చేశారు. ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ తిరస్కరించాయి. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా వెల్లడించారు. లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను పీవీఆర్, ఐనాక్స్ తమ థియేటర్లలో ప్రదర్శించడానికి అంగీకరించడం లేదని
రాసుకొచ్చారు. 

సుప్రీం కోర్టు సైతం ఎల్జీబీటీ కమ్యూనిటీని గౌరవిస్తూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందని... సెన్సార్ బోర్డ్ కూడా తన సినిమాని పాస్ చేసిందని కానీ ఇప్పుడు పీవీఆర్, ఐనాక్స్
తీసుకున్న నిర్ణయం చూస్తుంటే.. వారి మేనేజ్మెంట్ కి ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే ఎంత చిన్నచూపో అర్ధమవుతుందని రాసుకొచ్చారు. మరి ఈసారైనా నేషనల్ మల్టీఫ్లెక్స్ చైన్లలో దీన్ని
అనుమతిస్తారో లేదో చూడాలి! 
 

Follow Us:
Download App:
  • android
  • ios