Asianet News TeluguAsianet News Telugu

విజయ్‌ దేవరకొండ ఒక్కడికే ఆ సత్తా ఉంది.. ఆర్జీవీ కామెంట్‌..`యానిమల్‌` పెద్ద సోషల్‌ డ్యామేజ్‌ ఫిల్మ్ అంటూ షాక్‌

`యానిమల్‌` సినిమాని ఇండియన్‌ యాక్టర్స్ మొత్తంలో ఆ పాత్రని కేవలం ఒకే ఒక్కడు చేయగలడట. తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ విషయాన్ని చెప్పడం విశేషం.

ram gopal varma interesting comments on vijay deverakonda only he can capable that arj
Author
First Published Dec 10, 2023, 1:53 PM IST

విజయ్‌ దేవరకొండ.. రౌడీ బాయ్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. `అర్జున్‌రెడ్డి`తో ఆయన తనలోని రౌడీని బయటకు తీశాడు. దీనికి కారణం దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఈయన మొదటి సినిమా `అర్జున్‌రెడ్డి` అనే విషయం తెలిసిందే. నిజానికి ఆయన తన రెండో సినిమాతోనే ఇండియన్‌ బిగ్గెస్ట్ హిట్‌ మూవీ తీశాడని చెప్పొచ్చు. ఆయన రూపొందించిన `యానిమల్‌` మూవీ ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.ఈ మూవీ ఆరు వందల కోట్లు దాటిందని సమాచారం. 

రణ్‌ బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా ఇందులో జంటగా నటించారు. సినిమా మెయిన్‌గా రణ్‌బీర్‌ కపూర్‌ పాత్ర బేస్డ్ గా నడుస్తుంది. క్యారెక్టర్‌ బేస్డ్ చిత్రమిది. రణ్‌విజయ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. విశ్వరూపం చూపించాడు. కొడుకుగా, ప్రియుడిగా మాత్రమేకాదు యాటిట్యూడ్‌, ఆరోగెన్సీ, రాక్షసత్వం, హీరోయిజం ఇలా అన్ని యాంగిల్స్ లో చించేశాడు. `యానిమల్‌` సినిమా చూశాక ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట ఈ సినిమాని మరే హీరో చేయలేరని. 

కానీ ఇండియన్‌  యాక్టర్స్ మొత్తంలో ఆ పాత్రని కేవలం ఒకే ఒక్కడు చేయగలడట. తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ విషయాన్ని చెప్పడం విశేషం. ఆయనో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ `యానిమల్‌` సినిమా చూసి తనకు పిచ్చెక్కిపోయిందన్నారు. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌కి తాను ఫిదా అయినట్టు చెప్పారు. సినిమా ఫార్ములాని, సినిమా రూల్స్ ని ఇది బ్రేక్‌ చేసే మూవీ అని, వాటిని బ్రేక్‌ చేసే డైరెక్షన్‌ అని ఆయన వెల్లడించారు. అంతేకాదు సుధీర్ఘమైన రివ్యూ కూడా రాసుకొచ్చారు. వర్మ అలాంటి రివ్యూ రాయడం చాలా అరుదు. అంటే ఆయనకు ఆ మూవీ ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ సందర్భంగానే వర్మ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. `యానిమల్‌` సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ పాత్రకి మైండ్‌ బ్లాక్‌ అయ్యిందన్నారు. అయితే ఆయన పాత్రలో మరెవ్వరినీ ఊహించుకోలేమని చెప్పిన ఆయన.. ఆ పాత్ర చేయగల సత్తా కేవలం విజయ్‌ దేవరకొండకి మాత్రమే ఉందని, అతను మాత్రమే ఈ సినిమాకి సెట్‌ అవుతాడని, మరెవ్వరూ చేయలేరని చెప్పడం విశేషం. అంతేకాదు `యానిమల్‌` గురించి ప్రశంసలు కురిపించిన ఆయన ఈ మూవీపై పెద్ద షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సోషల్‌ యాస్పెక్ట్ లో ఇదొక పెద్ద డ్యామేజింగ్‌ ఫిల్మ్ అని, నేషనల్‌ అవార్డులు వంటి వాటికి ఇది సూట్‌ కాదంటూ, అర్హత సాధించలేదని ఆయన కామెంట్‌ చేయడం గమనార్హం.

తన `నిజం` యూట్యూబ్‌ ఛానెల్‌లో వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ దేరవరకొండ ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకుడు. `గీత గోవిందం` తర్వాత వీరి కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తుంది. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ఇందులో రష్మిక గెస్ట్ రోల్‌ చేస్తుంది. దీంతోపాటు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్నారు విజయ్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios