Asianet News TeluguAsianet News Telugu

'హను మాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ అని తేల్చేసిన రాంగోపాల్ వర్మ..

యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది.

Ram gopal varma interesting comments on Hanu Man movie dtr
Author
First Published Jan 12, 2024, 5:23 PM IST

యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. 

ప్రీమియర్ షోల నుంచే హను మాన్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ మొదలైంది. షోలు పెరిగే కొద్దీ ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ క్వాలీటీ అవుట్ పుట్ తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 

టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక తేజ సజ్జా చిన్న హీరో అనుకుంటే చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. అతడి స్క్రీన్ ప్రజన్స్, పెర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు నెమ్మదిగా హను మాన్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 

తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హను మాన్ చిత్రపై ట్వీట్ చేశారు. వర్మ ఎప్పుడూ ప్రశంసలు కురిపించినా, విమర్శించినా అందులో పరోక్షంగా కొన్ని సెటైర్లు ఉంటాయి. వర్మ స్టైల్ వేరుగా ఉంటుంది. కానీ హను మాన్ చిత్ర యూనిట్ ని మాత్రం సూటిగా అభినందిస్తూ వర్మ ట్వీట్ చేశారు. 

హేయ్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మీకు ముందుగా అభినందనలు. హనుమాన్ చిత్రం యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. జై హను మాన్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కి ప్రశాంత్ వర్మ థాంక్యూ సర్ అంటూ రిప్లై ఇచ్చారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios