వివాదాస్పద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ ఏ సినిమా చేయబోతున్నారనే విషయమై క్లారిటీ ఇచ్చేసారు. ఆయన  దృష్టి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకాల స్నేహితురాలు శశికళ జీవితంపై పడింది. 

‘శశికళ’ టైటిల్‌తో సినిమాని రూపొందిస్తున్నట్లు తన ట్విట్టర్ పేజీ ద్వారా ఆయన ప్రకటించి ,తమిళనాడులో సంచలనం సృష్టించారు. ‘లవ్ ఇస్ డేంజరస్‌లీ పొలిటికల్’ అనే ట్యాగ్ లైన్‌ను టైటిల్‌కు జత చేశారు.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపారు.

ఇక  ఈ బయోపిక్ కి జయలలితకు అత్యంత సన్నిహితురాలు అయినటువంటి శశికళ పేరు పెట్టడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ సినిమాలో వర్మ ఈ ఇద్దరిలో మధ్య ఉన్న అనుబందం చూపుతారని అంతా భావిస్తున్నారు. వీరి అనుబంధంపై రకరకాల కథల, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని ఈ సినిమా స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారు. ఈ మేరకు ఓ తమిళ రైటర్స్ టీమ్ ని ఎంపికచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరో ప్రక్క  ‘శశికళ’ సినిమాలో టైటిల్ రోల్‌ను ఎవరు చేస్తారు, జయలలితగా ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో వర్మ ఎన్ని వివాదాలకు కారకుడవుతాడో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఏదైమైనా ఇప్పుడు తాజాగా వర్మ చేసిన ఈ ప్రకటనతో మరోసారి సంచలనంగా మారారు.