Asianet News TeluguAsianet News Telugu

నేనెప్పుడూ చిరంజీవి కుటుంబంపై సెటైర్ వేయలేదు.. 'బాహుబలి' ట్వీట్ వివాదంపై వర్మ క్లారిటీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రతి అంశంపై వర్మ సెటైరికల్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.

Ram Gopal Varma gives clarity on controversy with Chiranjeevi
Author
First Published Dec 7, 2022, 1:45 PM IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రతి అంశంపై వర్మ సెటైరికల్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. కాంట్రవర్సీలతోనే వర్మ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. ఏదో ఒక అంశంపై కామెంట్స్ చేస్తూ వివాదం సృష్టించడం చూస్తూనే ఉన్నాం. 

ప్రస్తుతం వర్మ తాను తెరకెక్కించిన డేంజరస్ అనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీతో తనకి ఉన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

గతంలో వర్మ చిరంజీవిని ఉద్దేశిస్తూ సెటైరికల్ గా చాలా ట్వీట్స్ చేశాడు. ముఖ్యంగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 టైంలో వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ వివాదం గురించి వర్మకి తాజాగా ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. ఆ వివాదంపై వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

తాను ట్విట్టర్ లో సామాన్యుడిగానే తన అభిప్రాయాలు చెబుతానని వర్మ తెలిపారు. ఎలాంటి వివాదం సృష్టించే ఉద్దేశం నాకు లేదు. చిరంజీవి గురించి నేను ఎప్పుడు మాట్లాడినా, ట్వీట్ చేసినా ఒక అభిమానిగానే ప్రవర్తించాను. నేను చిరంజీవి కుటుంబంపై ఎప్పుడూ సెటైర్ వేయలేదు. 

అప్పట్లో చిరంజీవి రీ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి స్టార్ హీరో కాబట్టి ఆయన చిన్న చిత్రాలు చేయకూడదు. బాహుబలి లాంటి పెద్ద చిత్రాలు మాత్రమే చేయాలి అని నా అభిప్రాయం చెబుతూ ట్వీట్ చేశాను. ఒక అభిమానిగా నా అభిప్రాయం చెప్పాను. అందులో సెటైర్ ఏముంది అని వర్మ ప్రశ్నించారు. 

త్వరలో రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీతో వర్మ ఎలాంటి వివాదాలకు తెరలేపుతారో అనే చర్చ జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios