తాజాగా మరో ఆసక్తికర కామెంట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఫన్నీగా, సెటైరికల్‌గా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం. ఇందులో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నోముల భగత్‌ ని ఉద్దేశించి వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

రామ్‌గోపాల్‌ వర్మ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఓ వైపు వివాదాస్పద సినిమాలు తీస్తూ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారితే, మరోవైపు వివాదాస్పద కామెంట్లు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా మరో ఆసక్తికర కామెంట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఫన్నీగా, సెటైరికల్‌గా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం. ఇందులో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నోముల భగత్‌ ని ఉద్దేశించి వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

ఇందులో చిరుత పులితో నోముల భగత్‌ అడవిలో వాక్‌ చేస్తున్న వీడియోని పంచుకున్నాడు వర్మ. దీనిపై ఆయన స్పందిస్తూ, `నోముల భగత్‌ తనకి, టీఆర్‌ఎస్‌కి ఓట్‌ వేయండి, ఇతర పార్టీలకు వేయకండి` అని చెబుతున్నారు. కానీ ఆయన గొలుసుతో చిరుతని పట్టుకున్న వీడియోని షేర్‌ చేస్తూ ఇలా క్యాంపెయిన్‌ చేయడం ప్రపంచ చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. హ్యాట్సాఫ్‌ కేసీఆర్‌, కేటీఆర్‌` అని పేర్కొన్నారు వర్మ. 

Scroll to load tweet…

మరో ట్వీట్‌లో ఆయనస్పందిస్తూ, వామ్మో.. కేసీఆర్‌, కేటీఆర్‌ పులి, సింహాలు అని తెలుసు. కానీ చిరుతతో వాక్‌ చేస్తున్న భగత్‌ నోముల నాకు బాగా నచ్చాడు. నాకు గనక ఓటు ఉంటే కచ్చితంగా ఈ రియల్‌ హీరోకి ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో ఓట్‌ వేస్తాను` అని పేర్కొన్నాడు. నోముల భగత్‌ టీఆర్‌ఎస్‌ తరపున నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు. నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన కుమారుడు నోముల భగత్‌ పోటీకి దిగారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే రామ్‌గోపాల్‌ వర్మ వివాదాస్పద చిత్రాలతో, వెబ్‌ సిరీస్‌తో రాణిస్తున్నారు. ఒకప్పుడు సంచలనాత్మక చిత్రాలు చేసిన ఆయన ఇప్పుడు సామాజిక అంశాలు, ముఖ్యంగా వివాదాస్పద అంశాలను కథా వస్తువుగా ఎంచుకుని సినిమాలు తీస్తున్నారు. వాటిని డిఫరెంట్‌గా ప్రమోట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఇటీవల `ఢీ కంపెనీ` పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు.అది విడుదలై ఫర్వాలేదనిపించుకుంది.