శ్రీదేవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న రామ్‌గోపాల్ వర్మ.. అభిమాని ఓదార్పు..
శ్రీదేవి బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నడు మొదట బాధ పడింది RGVనే. ఆమె చనిపోయినప్పుడు కూడా ఆయన అంతే బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఆమెని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రామ్‌గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు సంచలనాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. `శివ`, `సర్కార్`, `క్షణక్షణం`, `మనీ` మూవీస్‌తో ఆయన సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఇటు తెలుగు, అటు బాలీవుడ్‌లోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఎస్ ఎస్ రాజమౌళి వంటి దర్శకధీరుడు సైతం వర్మ కెపాసిటి, కెపాబులిటీ గురించి మాట్లాడారంటే ఆయనేంటో అర్థం చేసుకోవచ్చు. కానీ రాను రాను దర్శకుడిగా పడిపోతూ వస్తున్నారు. ఆయన క్రేజ్ తగ్గుతూ వస్తుంది. ఆయన పోస్ట్ లు గానీ, ఆయన చేస్తున్న సినిమాలు కూడా వివాదాలుగా మారుతున్నాయి.
ఇప్పుడు వర్మ నుంచి సినిమా వస్తుందంటే పట్టించుకునే వాళ్లు తక్కువై పోయారు. పైగా వివాదాస్పద అంశాలతో ఆయన సినిమాలు చేయడం కూడా ఇదో కారణం. దర్శకుడిగా ఆయన సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోతుంది. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఇప్పుడు హంగామా తప్ప మ్యాటర్ లేదనేలా కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వర్మకి అమ్మాయిల పిచ్చి అంటారు. ఆయనే దీన్ని ఒప్పుకుంటారు. బహిరంగంగానే చెబుతుంటాడు. ఇక ఆయన ఫేవరేట్ హీరోయిన్ శ్రీదేవి. అతిలోక సుందరిని ఆయన అమితంగా ఇష్టపడతాడు. ఆరాధిస్తాడు.
శ్రీదేవి బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నడు మొదట బాధ పడింది అతనే. ఆమె చనిపోయినప్పుడు కూడా ఆయన అంతే బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఆమెని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ అభిమాని ఏఐ(ఆర్టిఫిషియన్ ఇంటలిజెన్సీ) ద్వారా శ్రీదేవి బొమ్మని క్రియేట్ చేశాడు. యంగ్ శ్రీదేవిగా మార్చాడు. కానీ ఆ ఫోటో శ్రీదేవిలా లేదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ శ్రీదేవి ఏడిపించిందని పోస్ట్ చేశాడు వర్మ. ఈ ఇంటలిజెట్లీగా తయారు చేసిన ఆర్జిఫిషియల్ శ్రీదేవి నన్ను ఏడిపించింది` అంటూ ఆయన పోస్ట్ పెట్టారు.
ఇది ఇప్పుడు నెట్టింట మరింతగా రచ్చ చేస్తుంది. అసలు శ్రీదేవిలాగే లేదని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని మాత్రం వర్మని ఓదార్చే ప్రయత్నం చేశాడు. బాధపడకు వర్మజీ.. ప్రతి ఒక్కరి హృదయంలో శ్రీదేవి సజీవంగానే ఉందని, ఆమె రూపం అలానే ఉందని చెబుతూ వర్మని ఓదార్చేలా పోస్ట్ పెట్టాడు. అన్నింటిలో కెల్లా అది మరింత హైలైట్‌గా నిలుస్తుంది. మొత్తానికి అడపాదడపా సోషల్ మీడియాలోకి వచ్చి వర్మ గిలిగింతలు పెడుతుంటాడు. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుతుంటాడు. తన అవసరం కోసం ఇలాంటివి చేస్తుంటారు వర్మ.
ఇక ప్రస్తుతం ఆయన `వ్యూహం` అనే చిత్రాన్ని రూపొందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ లైఫ్ బేస్డ్ గా దీన్ని తెరకెక్కించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ మూవీని తెరకెక్కించారు. వైఎస్ మరణించడంతో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నారా లోకేష్ ఇలా ప్రత్యర్థ పార్టీలు, నాయకులు ఏం చేశారు? వైఎస్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే కాన్సెప్ట్ `వ్యూహం` చిత్రాన్ని రూపొందించారు. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. అయితే ఎప్పుడో ఈ మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ విడుదలను ఆపాలంటే నారా లోకేష్, టీడీపీ నాయకులు కోర్ట్ కి వెళ్లడంతో దీనిపై స్టే విధించారు. విడుదలకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Read more: `సలార్`, `హనుమాన్`, `బిగ్ బాస్7`.. ముగ్గురు `ప్రశాంత్`లు కలిసి నెల రోజుల్లో ఇండియానే ఊపేశారు..!