MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ప్రశాంత్‌ నీల్‌, ప్రశాంత్‌ వర్మ, పల్లవి ప్రశాంత్‌.. ముగ్గురు కలిసి ఇండియానే ఊపేశారు.. ఇది మామూలు మాస్‌ కాదు

ప్రశాంత్‌ నీల్‌, ప్రశాంత్‌ వర్మ, పల్లవి ప్రశాంత్‌.. ముగ్గురు కలిసి ఇండియానే ఊపేశారు.. ఇది మామూలు మాస్‌ కాదు

ప్రశాంత్‌ల టైమ్‌ నడుస్తుంది. `ప్రశాంత్‌` పేరు ఇప్పుడు ఇండియన్‌ సినిమాని షేక్‌ చేస్తుంది. బుల్లితెర నుంచి వెండితెర వరకు రెండింటిలోనూ రచ్చ చేస్తుంది. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 23 2024, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం టాలీవుడ్‌లో `ప్రశాంత్‌`ల మేనియా సాగుతుంది. ప్రశాంత్‌లే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని రూల్ చేస్తున్నారు. నెల రోజుల పాటు టాలీవుడ్‌ని ఊపేశారు. టీవీ నుంచి సినిమా వరకు `ప్రశాంత్‌` సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు వారి పేరే అటు సోషల్‌ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. టీవీ రంగంలోనూ బాగా వినిపిస్తుంది. డిజిటల్‌ని బాగా ప్రభావితం చేస్తుంది. మరి ఆ `ప్రశాంత్‌` ల కథేంటి? వాళ్లు రూల్‌ చేస్తుందేంటి? అనేది ఓ సారి చూస్తే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇటీవల `సలార్‌` సినిమా సంచలన విజయం సాధించింది. ఇది ఏడు వందల కోట్లకుపైగా వసూలు చేసింది. ప్రభాస్‌ సత్తా ఏంటో చూపించింది. నార్త్ లో `డంకీ` వంటి పెద్ద అడ్డంకి ఉన్నప్పటికీ ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. చాలా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాలు పంచింది. మంచి కలెక్షన్లని సాధించింది. అయితే వెయ్యికోట్లకుపైగా కలెక్షన్లని ఆశించినా, డంకీ ప్రభావం కారణంగా ఈ మూవీకి కలెక్షన్లు తగ్గిపోయాయి. లేదంటే ఈజీగా వెయ్యి కోట్లు దాటేది. అయితే ఈ మూవీని రూపొందించిన దర్శకుడు `ప్రశాంత్‌` నీల్‌. `కేజీఎఫ్‌` తో సంచలనాలు క్రియేట్‌ ప్రశాంత్‌ నీల్‌.. `సలార్‌`తో మరోసారి మ్యాజిక్‌ చేశాడు. తెలుగు సినిమాకి ఇయర్‌ ఎండ్‌లో ఊపిరి పోశాడు. జోష్‌ నింపాడు. 

35

సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన సంచలనాలు సృష్టిస్తుంది `హనుమాన్‌`మూవీ. హనుమంతుడి ఎలిమెంట్లతో వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికే రెండు వందల కోట్లు దాటింది. మూడు వందల కోట్ల దిశగా వెళ్తుంది. తేజ సజ్జా వంటి అప్‌కమింగ్‌ హీరో సినిమా స్టార్‌ హీరోల సినిమాలను మించి కలెక్షన్లని సాధించడానికి, ఈ మూవీ ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి కారణం చిత్ర దర్శకుడు `ప్రశాంత్‌` వర్మ. ఆయన మ్యాజిక్‌ ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కి చేరుకుంది. ఓ రకంగా ఈ మూవీకి అసలైన హీరో ప్రశాంత్‌ వర్మనే అని చెప్పొచ్చు. 
 

45

ప్రశాంత్‌ వర్మ, ప్రశాంత్‌ నీల్‌ పెద్ద తెరని సేక్‌ చేస్తే, పల్లవి ప్రశాంత్‌ బుల్లితెరని షేక్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌లో సాధారణ కంటెంస్ట్ లాగా వచ్చి అదరగొట్టాడు. రాను రాను తన విశ్వరూపం చూపించాడు. షో మధ్యలోకి వచ్చేసరికి హౌజ్‌లో కింగ్‌ అయిపోయాడు. టాస్క్ లు, నామినేషన్లలో దుమ్ము రేపి ఆకట్టుకున్నారు. రైతు బిడ్డ ట్యాగ్‌తో అందరికి దగ్గరయ్యాడు. ఏకంగా టైటిల్‌ విన్నర్‌గా నిలిచి అందరికి షాక్‌ ఇచ్చాడు. బిగ్‌ బాస్‌ షో తర్వాత ఆయన పేరే మారు మ్రోగింది. ఫ్యాన్స్ వివాదంలోనూ ఆయన పేరే రచ్చ చేసింది. ఏ బిగ్‌ బాస్‌ విన్నర్‌ పేరు వినిపించనంతగా ఊపేసింది. 
 

55

ఇలా ఇటు బుల్లితెరపై పల్లవి ప్రశాంత్‌, అటు పెద్ద తెరపై ప్రశాంత్‌ నీల్‌, ప్రశాంత్‌ వర్మలు దుమ్ము రేపారు. ఈ ముగ్గురు `ప్రశాంత్‌`లే కావడం విశేషం. అలా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఈ `ప్రశాంత్‌` ల రచ్చ మామూలు కాదని చెప్పొచ్చు. అయితే ఈ ముగ్గురు నెల రోజుల పరిధిలోనే హంగామా చేయడం విశేషం. మొదట పల్లవి ప్రశాంత్‌ `బిగ్‌ బాస్‌`తో ఊపేశాడు. ఆ షో అయిపోయిన ఐదు రోజులకే ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌` వచ్చింది. ఇక నెల లోపే `హనుమాన్‌` వచ్చింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని శాషించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ వ్యాప్తంగా `ప్రశాంత్‌` పేరు సందడి చేయడం విశేషం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image3
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved