సందీప్ వంగ తెరకెక్కించిన కబీర్ సింగ్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది. దీనితో తోడు సందీప్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. ప్రేమికులు ఒకరినొకరు కొట్టుకునేంత చనువు లేకుంటే వారిమధ్య ప్రేమ లేనట్లే అని సందీప్ చేసిన వ్యాఖ్యలు సమంత, చిన్మయి లాంటి సెలెబ్రెటీలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. 

ఈ విషయంలో వివాదాస్పద దర్శకుడు వర్మ కబీర్ సింగ్ చిత్రానికి మద్దతు తెలుపుతున్నాడు. పైగా బాహుబలి 2 హిందీ వర్షన్ కంటే కబీర్ సింగ్ చిత్రం నాలుగు రెట్లు పెద్దదని ట్విటర్ లో పోస్ట్ పెట్టాడు. బాహుబలి 2 చిత్ర ఇన్వెస్ట్మెంట్ తో పోల్చుకుంటే, కబీర్ సింగ్ చిత్రం 4 రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. 

బాహుబలి 2 పూర్తి కావడానికి రెండేళ్ల సమయం పడితే.. కబీర్ సింగ్ చిత్రాన్ని సందీప్ కేవలం 6 నెలల్లోనే పూర్తి చేశాడు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే బాహుబలి 2 కంటే కబీర్ సింగ్ చిత్రం 16 రెట్లు పెద్దదని వర్మ వ్యాఖ్యానించాడు.