కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై సక్సెస్ అందుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగునాట మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 

హిందీలో ఈ సినిమా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జీరో' సినిమాకంటే ఎక్కువ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని అంచనా.. తొలిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.18 కోట్లు వసూలు చేసింది.

తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ''సినిమాకు ప్రాంతీయ అడ్డంకులు ఉండవి, మంచి సినిమా ఎక్కడైనా తీయగలరని, ఎక్కడైనా అలాంటి సినిమాలు సక్సెస్ సాధిస్తాయని మొదట 'బాహుబలి' సినిమా నిరూపించింది.

ఆ తరువాత '2.0'.. ఇప్పుడు కన్నడ సూపర్ హిట్ 'కెజిఎఫ్'లతో నిరూపితమైంది. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు'' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.