తనకు నచ్చని వారిని ట్విట్టర్ వేదికగా విమర్శిస్తాడు. ఒక వేళ నచ్చితే.. అదే వేదికగా పొగడ్తల వర్షం కురిపిస్తాడు. మొన్నటి  వరకు మోగా ఫ్యామిలీని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై వర్మ విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన దృష్టి ‘ అర్జున్ రెడ్డి’ మూవీ  మద పడింది.

సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మకు.. ఎవరైనా నచ్చినా కష్టమే.. నచ్చకపోయినా కష్టమే. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే వర్మ... తనకు నచ్చని వారిని ట్విట్టర్ వేదికగా విమర్శిస్తాడు. ఒక వేళ నచ్చితే.. అదే వేదికగా పొగడ్తల వర్షం కురిపిస్తాడు.

మొన్నటి వరకు మోగా ఫ్యామిలీని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై వర్మ విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన దృష్టి ‘ అర్జున్ రెడ్డి’ మూవీ మద పడింది. ఇప్పటి కే సినిమాని, హీరో విజయ్ దేవర కొండను పొగిడిన వర్మ.. మళ్లీ ఈ సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. కాకపోతే ఈ సారి.. ఈ సినిమాతో పవన్ ని కూడా కలిపాడు.

"‘తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తి అయినా ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు కాకుండా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా ఉంటారా! అలా ఎవరైనా ఉంటే, వారు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం, మోసం చేసినవాళ్లు అవుతారే తప్పా, మరేమీ కారు." అన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ ఈ సినిమా చూసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉండడు అన్నారు ఆయన. వాటిని చూస్తుంటే.. వర్మ.. పవన్ ని తిట్టాడా.. విజయ్ దేవర కొండను పొగిడాడో అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. పవన్ అభిమానులు మాత్రం.. మళ్లీ మా హీరో మీద పడ్డాడేంటిరా బాబు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కత్తి మహేష్ లాంటి సినీ విమర్శకుడి కమెంట్స్ కు చిర్రెత్తిపోతున్న పీకే ఫ్యాన్స్ వర్మ కమెంట్స్ తో శివాలెత్తుతున్నారు. మరి ఎలా సమాధానం చెప్తారో చూడాలి.