Asianet News TeluguAsianet News Telugu

సంచలన ప్రాజెక్ట్ ని ప్రకటించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఉపేంద్రతో సినిమా..!

దర్శకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ పని అయిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన చిత్రాన్ని ప్రకటించాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఏకంగా కన్నడ స్టార్‌ ఉపేంద్రతో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు.

ram gopal varma announced big project with upendra
Author
Hyderabad, First Published Sep 18, 2021, 6:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల కాలంలో అన్ని ఓటీటీ సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తున్నారు. నాగార్జునతో చేసిన `ఆఫీసర్‌` తప్ప అన్ని సినిమాలు చిన్న చిత్రాలే కావడం గమనార్హం. పైగా అవి ఎక్కువగా అడల్ట్ కంటెంట్‌తో ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. దర్శకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ పని అయిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన చిత్రాన్ని ప్రకటించాడు రామ్‌గోపాల్‌ వర్మ. 

ఏకంగా కన్నడ స్టార్‌ ఉపేంద్రతో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. నేడు(శనివారం-సెప్టెంబర్‌18) ఉపేంద్ర పుట్టిన రోజు. ఈ సందర్భంగా వర్మ బర్త్ డే విషెస్‌ తెలిపారు ఉపేంద్రకి. `ఉపేంద్రతో ఓ యాక్షన్‌ సినిమా చేయబోతున్నామని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తాం. ఈ సందర్భంగా ఉపేంద్రకి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని ట్వీట్‌ చేశాడు వర్మ. ఈ సందర్భంగా ఉపేంద్రతో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నాడు.

వివాదాస్పద అంశాలను కథా వస్తువులుగా చేసుకుని సినిమాలు చేస్తున్నాడు వర్మ. మరోవైపు సమాజంలోని సమస్యలను కథా వస్తువుగా చేస్తున్న సినిమాలు చేస్తూ సందేశాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర `కబ్జా` చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. గతంలో `సన్నాఫ్‌ సత్యమూర్తి`లో కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ `గని` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios