అఖిల్ కోసం రంగంలోకి దిగిన వర్మ

First Published 28, Mar 2018, 2:58 PM IST
Ram Gopal Varma Announce Movie with Akhil
Highlights
అఖిల్ కోసం రంగంలోకి దిగిన వర్మ

 

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగులు మార్చడంలో ఊసరవెల్లి ని మించిపోయాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న ట్వీట్ లలో చాలా వరకు తెలియని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. పైకి మనసు బండరాయి అనేట్లు కనిపిస్తాడు గాని సున్నితమైన ఫీలింగ్స్ అతనికి కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆ విషయాన్ని పక్కనబెడితే.. వర్మ కరెక్ట్ గా ఒక కాన్సెప్ట్ సెట్ చేసుకున్నాడు అంటే చాలు ఆ కథకు తగ్గట్టు పాత్రలను సెట్ చేసుకుంటాడు. 

చాలా కాలం తరువాత నాగ్ లాంటి స్టార్ హీరోతో జాతకట్టిన వర్మ ఆఫీసర్ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ఆయన తనయుడితో కూడా ఓ సినిమా ప్లాన్ చేసినట్లు చెప్పేశాడు. అఖిల్ రీసెంట్ గా తన మూడవ సినిమా ను లాంచ్ చేశాడు. తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ తరువాత అఖిల్ నాలుగవ సినిమాని వర్మ డైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పేశాడు. దీంతో అందరు షాక్ అయ్యారు. అఖిల్ కెరీర్ తో ఆటలు అవసరమా అనే తరహాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అసలే అఖిల్ కమర్షియల్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలో మరో డిజాస్టర్ అందితే కెరీర్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కానీ నాగ్ మాత్రం వర్మను గట్టిగా నమ్మేశాడు. అప్పట్లో నేను డైరెక్ట్ చేసిన శివ సినిమాని నాగ్ నిర్మించాడు. 25 ఏళ్ల తరువాత నేను నాగ్ తో ఆఫీసర్ సినిమా నిర్మిస్తున్నాను. ఇక ఫైనల్ గా అఖిల్ నాలుగవ సినిమాను నాగ్ నిర్మిస్తుండగా నేను డైరెక్ట్ చేస్తున్నాను అని వర్మ ట్వీట్ చేశాడు. ఏమయ్యా వర్మా.. ఇలా అఖిల్ కెరియర్ తో ఆటల ఏలయ్యా? మరి కుర్రాడికి ఫ్లాపు మాత్రం ఇవ్వకు సామీ!!

 

loader