Asianet News TeluguAsianet News Telugu

‘పంది బస్సు’ అంటూ పవన్ వాహనంపై వర్మ కామెంట్స్,వివాదం

ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించిన ‘వారాహి’ వాహనాన్ని ‘పంది వాహనం’ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ  వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

Ram Gopal Varma again comments on Pawan Klayan
Author
First Published Jan 25, 2023, 6:55 AM IST


ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ... జనసేనాని పవన్‌ కల్యాణ్‌, మెగా బ్రదర్‌ నాగబాబులపై ఏదో విషయంలో తలదూర్చి మాట్లాడుతూంటారు..వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూంటారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పై  మళ్లీ సెటైర్లు వేశారు. తన అధికారిక ట్విట్టర్ లో పవన్ వాహనం వారాహితో నిలబడ్డ ఫొటోను షేర్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించిన ‘వారాహి’ వాహనాన్ని ‘పంది వాహనం’ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘‘ఆ రోజుల్లో రామారావు గారు ‘చైతన్య రథం’ మీద తిరిగితే.. మీరు ‘పంది బస్సు’ మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ కళ్యాణ్ గారూ. ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం. అంటూ ట్వీట్ చేసారు.

అలాగే ‘‘గుడిలో ఉంటే అది ‘వారాహి’.. రోడ్డు మీద ఉంటే అది ‘పంది’.. పీ, తన పందికి ‘వారాహి’ అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే’’ అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించక పోతే మన పవిత్ర ‘వారాహి’ని ఒక ‘పంది బస్సు’గా ముద్ర వేస్తారు. జై పీకే.. జై జనసేన.

డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi (పంది బస్సు వారాహి) హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి.’’ అంటూ ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. వారాహి అంటే అమ్మవారు పేరు అని అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు అని అంటున్నారు. చూడాలి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో.

ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనాన్ని పవన్ తనకు కావాల్సినట్లుగా తయారు చేయించారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు ఇప్పటికే రెడీ అయిన పవన్ ఇక ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ వాహనానికి అమ్మవారి పేరు పెట్టారు పవన్ కళ్యాణ్. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios