ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న మ్యాటర్ రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్. ఇక ఈ విషయంలో అందరూ ఆర్టీవీ స్పందన గురించి ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు ఆయన స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
ప్రముఖం బాలీవుడ్ హీరో... స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే భర్త రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటో షూట్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్న క్రమలో కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తుండగా..మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్షిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ విషయంలో అందరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందన కోసం ఎదురు చూశారు. ఆయన మార్క్ లో ఏమైనా కామెంట్స్ చేస్తారేమో అని వెయిట్ చేశారు. ఇక ఎట్టకేలకు వర్మ స్పందిస్తూ.. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు మద్దతు పలికారు. రణ్ వీర్ సింగ్ మద్దతుదారుల్లో ఇప్పుడు వర్మ కూడా చేరిపోయారు.
ఇక లేడీస్ తమకు ఇష్టమొచ్చినట్టుగా ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పలు లేదు కాని.. పురుషులు ఆ పని ఎందుకు చేయకూడదు? అంటూ ఆర్జీవి ప్రశ్నించారు. లింగ సమానత్వానికి న్యాయం చేయాలని కోరడం కోసం రణవీర్ సింగ్ ఇలా చేసి ఉండవచ్చు అని ఆయన అభిప్రాయ పడ్డారు.
అంతే కాదు.. హీరోయిన్లు రకరకాలుగా రొమాంటిక్ యాంగిల్స్ లో స్కిన్ షో చేసినప్పుడు హీరోలు అలా చేయడంతో తప్పేముంది... ఎందుకు చేయకూడదు? మగవారిని భిన్న ప్రమాణాలతో చూడడం మంచిది కాదు . మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయి అని రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
రణవీర్ సింగ్ రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్ ఫొటో షూట్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను స్వయంగా రణ్ వీర్ సింగ్ తన సోషల్ మీడియా పేజ్ లో పంచుకున్నారు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఈ విషయంలో కొందరు మహిళలు ముంబై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. రణ్ వీర్ సింగ్ ను కొందరు ను కొందరు సమర్థిస్తుంటే, కొందరు విమర్శిస్తున్నారు.
అయితే ఇప్పటికే అది ట్రెండ్ గా కూడా మారింది. ఈ మధ్య తమిళ నటుడు విష్ణు విశాల్ కూడా ఇలాగే ఫోటో షూట్ చేసి.. రణ్ వీర్ కు మద్దతు పలికాడు. ఇలా చాలా మంది సెమి న్యూడ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మొత్తానికి రణ్ వీర్ సింగ్ సాహసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
