ఫన్, రొమాంటిక్ కామెడీలు చేసే రామ్ తన కెరీర్ లో  ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదు. ఒకటిరెండు సార్లు మాస్ సినిమాలు చేసినా అవి అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో తన సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తూ ఉండిపోయాడు. అయితే  పూరి సీన్ లోకి వచ్చి  సినిమా చేసి రామ్ స్టామినా ఏంటో అతనికే తెలియచేసాడు. దాంతో ఇప్పుడు రామ్ పరిస్దితి కన్ఫూజన్ గా మారింది. 

తను నెక్ట్స్ ఇదే జోన్ లో కంటిన్యూ అవుతూ మాస్ సినిమాలు చేయాలా,లేక సాప్ట్ రొమాంటిక్ కామెడీలు గతంలో మాదిరి చేసుకుంటూ వెల్లాలా అనేది. అయితే ఇస్మార్ట్ శంకర్ కు ముందు రామ్ ఓ మూడు స్క్రిప్టు ఓకే చేసి పెట్టుకున్నాడు. అవి సాప్ట్ గా సాగే స్టోరీలు. కొద్ది పాటి యాక్షన్ ని వాటికి కలుపుదాం అని ఆ డైరక్టర్ ప్రపోజల్స్ పెడుతున్నారట. కానీ రామ్ కే దైర్యం చాలటం లేదని చెప్తున్నారు. వాటితో ముందుకు  వెళ్లాలా..తన కొత్త ఇమేజ్ కు తగినట్లు సినిమాలు చేయాలా అనేది పెద్ద సమస్యగా మారిందిట.

ఇప్పటికే ఇద్దరు స్టార్ డైరక్టర్స్ తమ దగ్గర పక్కా మాస్ మసాలా యాక్షన్ స్క్రిప్టు ఉందని కబురు పంపారట. ఇంత కన్ఫూజన్ తన కెరీర్ లో ఎప్పుడూ ఫీలవలేదని, చివరకు ఫ్లాఫ్ లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్దితి ఎదురు కాలేదని వాపోతున్నాడట. ఏదైమైనా అన్ని రకాలుగా ప్రూవ్ అయిన హీరో రామ్. ఏ సినిమా చేసినా ఫెరఫెక్ట్ గా సూట్ అవుతాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ ఇన్ఫూలియన్స్ అనేది కొంతకాలం మాత్రం రామ్ కెరీర్ పై ఉంటుందనేది నిజం.