పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.  అయితే చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరికి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. గత కొన్నేళ్లుగా ప్లాప్స్ ఎదుర్కొంటున్న దర్శకుడు, హీరో, హీరోయిన్స్ ఇస్మార్ట్ శంకర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. 

అందుకే సినిమా ప్రమోషన్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. బోనాల జాతర స్టయిల్లో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రచ్చ చేసిన టీమ్ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో రామ్ దర్శకుడు పూరి హిట్టు కొట్టాడు అంటే తిరుగుండదని అంటున్నాడు. రీసెంట్ గా విజయవాడకు వెళ్లిన ఇస్మార్ట్ యూనిట్ సినిమా ప్రమోషన్స్ నిర్వహించింది. 

రామ్ స్పందిస్తూ.. ఆడియెన్స్ నుంచి ట్రైలర్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది.జగడం అనంతరం మళ్ళీ ఇన్నాళ్ళకి పూర్తి స్థాయిలో మాస్ క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాటరీ లాంటి వారు కొడితే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవుతాయి' అని ఇస్మార్ట్ గా రామ్ వివరించాడు.