మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాజకీయ సామాజిక అంశాలతో గతంలో శంకర్ తెరకెక్కించిన చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. దీనితో గేమ్ ఛేంజర్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా నిన్న చెన్నై లో డైరెక్టర్ శంకర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. శంకర్ పుట్టినరోజు వేడుకల్లో రాంచరణ్ కూడా పాల్గొన్నారు. 

గురువారం సాయంత్రం శంకర్ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి తమిళ అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. ఈ పార్టీలో ఒక శక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం తమిళనాట అగ్ర దర్శకులుగా వెలుగొందుతున్న వారంతా రాంచరణ్ తో గ్రూప్ ఫోటో దిగారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఫోటోలో వెట్రి మారన్, లోకేష్ కనకరాజ్, మురుగదాస్, శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్ జె సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, విగ్నేష్ శివన్ తో పాటు హీరో చియాన్ విక్రమ్, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా ఉన్నారు. రామ్ చరణ్ బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. 

లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకులతో ఫ్యూచర్ లో రాంచరణ్ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మరి తమిళ టాప్ డైరెక్టర్స్ తో చరణ్ ఇలా క్లోజ్ రిలేషన్ మైంటైన్ చేయడం ఆసక్తిగా మారింది.