మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అఖిల్ ప్రతి సినిమాకు రామ్ చరణ్ తన విషెస్ చెబుతుంటాడు. ప్రస్తుతం అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అఖిల్ నటించిన గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు అఖిల్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇటీవల జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

రీసెంట్ గా ట్రైలర్ చూసిన రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా అఖిల్ తన విషెస్ తెలియబరిచాడు. ట్రైలర్ చాలా బాగుందని, అఖిల్, నిధి అగర్వాల్, వెంకీ అట్లూరి, బీవీఎస్ఎన్ ప్రసాద్ అలానే చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టాడు.