Asianet News TeluguAsianet News Telugu

‘డియరెస్ట్ సమంత.. చాలా గర్వంగా ఉంది’.. సమంతకు రామ్ చరణ్ ఆసక్తికరంగా బర్త్ డే విషెస్..

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో   గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు.
 

Ram Charan Wishes Samantha on her Birthday NSK
Author
First Published Apr 28, 2023, 5:39 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు, ఆమె అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎదుకంటే సమంత పుట్టిందిన రోజు ఇవాలె కావడం విశేషం. 1987 ఏప్రిల్ 28న చెన్నైలో సామ్ జన్మించింది.  తెలుగువాడైన జోసెఫ్ ప్రభు - మలయాళీకి చెందిన నినెట్ ప్రభు దంపతులకు పుట్టింది. బాల్యం మొత్తం చెన్నైలోనే గడిపింది. అలాగే తన చదువు కూడా అక్కడే పూర్తి చేసింది. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాక సినీ రంగంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

ఇక ఈరోజు సమంత 36వ పుట్టినరోజు కావడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడు దేవ్ మోహన్, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, రష్మిక మందన్న, కీర్తి సురేష్, అనుష్క శర్శ, విజయ్ దేవరకొండ తమ బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు. ఈ సందర్బంగా ట్వీట్టర్ లో ఇంట్రెస్టింగ్ స్పందించారు. 

రామ్ చరణ్  ట్వీటర్ ద్వారా సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘డియరెస్ట్ సమంత’ అంటూ ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశారు. ‘డియరెస్ట్ సమంత! మీ పట్ల మరియు మీ చేస్తున్న అద్భుతమైన పనికి చాలా గర్వంగా ఉంది. మంచి ఆరోగ్యం, విజయం మీవెంటనే  ఉండాలని కోరుకుంటున్నారు. ఫుట్టిన రోజు శుభాకాంక్షలు. అలాగే మీ #Citadelకు గుడ్ లక్’ అంటూ ట్వీట్ చేశారు. చెర్రీ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

వర్క్ విషయానికొస్తే.. సమంత - రామ్ చరణ్ జంటగా ‘రంగస్థలం’లో నటించిన విషయం తెలిసిందే. చరణ్ కు ‘మగధీర’ తర్వాత గుర్తింపును తెచ్చి పెట్టిన చిత్రంగా Rangasthalam నిలిచిపోయింది. ఇక రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గానూ మారిపోయారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఇక సమంత ‘సిటడెల్’ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios