ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. కోటీశ్వరుల ఇంట్లో పుట్టినా కష్టం తెలియకుండా పెరగలేదని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఉపాసన తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. తన ఆవేదన తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. '' గోల్డెన్ కూడా కాదు నేను డైమండ్, ప్లాటినమ్ స్పూన్ తో పుట్టానని అందరూ అంటారు. కానీ అది నేను కోరుకున్నది కాదు. నేను ఎలాంటి పని చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు. కానీ నేను కష్టపడాలనుకున్నాను. మీరు ఎప్పుడైనా నా గురించి నెగిటివ్ గా రాస్తే... అది మీలోని నెగిటివిటీ బయటపెట్టుకున్నట్లు లెక్క. చరణ్ ని వివాహం చేసుకోవడం ద్వారా నేను మరింత పని చేయడం , కష్టపడటం నేర్చుకున్నాను. నా లక్ష్యాల పట్ల స్పష్టత సాధించాను. ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నీ బాధ్యత మరింత పెరుగుతుంది'' అని అన్నారు.
''నాకు ఇలాంటి ఉన్నతమైన జీవితం ఇచ్చేందుకు పేరెంట్స్ చాలా కష్టపడ్డా రు. అలాగే కష్టం విలువ ఏమిటో తెలిపారు. మా పిల్లల్ని కూడా మేము అలానే పెంచుతాము'' అని ఉపాసన ఆ వీడియోకి కామెంట్ పోస్ట్ చేశారు. ఉపాసన, రామ్ చరణ్ లకేంటి! వేల కోట్ల సంపద ఉందని విమర్శిస్తున్న వాళ్లకు ఉపాసన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మేము పుట్టుకతో కోటీశ్వరులుగా పుట్టినప్పటికీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కష్టపడ్డామని పరోక్షంగా చెబుతున్నారు.
ఉపాసన అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇక రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగేందుకు కష్టపడి నైపుణ్యాలు పెంచుకున్నాడు. కాగా పెళ్ళైన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చారు. ఈ విషయాన్ని చిరంజీవి అంత్యంత సంతోషం ప్రకటిస్తూ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఎప్పటి నుండో మెగా వారసుడు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీసింది. అలాగే ఉపాసన మీదున్న కొన్ని అపవాదులు తొలగిపోయాయి.
