Asianet News TeluguAsianet News Telugu

అల్లుడి పాటకు అత్త డాన్స్, నాటు నాటు సాంగ్ కు రామ్ చరణ్ అత్త మాస్ స్టెప్పులు

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ ఊపు ఊపేస్తోంది. ఈక్రమంలో...ఈపాటకు మెగా పవర్ స్టార్ అత్త కూడా అదరిపోయే స్టెప్పులేసింది.. అది కూడా విదేశాల్లో..
 

Ram Charan Wife Upasana Mother Dance with Natu Natu Song
Author
First Published Jan 21, 2023, 10:12 PM IST

అంతర్జాతీయ స్థాయిలో రచ్చ రచ్చ చేస్తోంది ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్. ఇండియా నుంచి  గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి  సాంగ్  కూడా ఇదే. తెలుగు సినిమాను తక్కువగా చూసిన ఇతర ఇండస్ట్రీవాళ్ల కళ్ళు తెరిపిస్తూ.. దిమ్మతిరిగేలా కౌంటర్లిస్తూ.. నాటు నాటు  పాట గుర్తింపు సొంతం చేసుకుంది. అటు ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఆస్కార్ రేసులో పరుగులు తీస్తుంది. 

ఈ పాటకు స్టెప్పులు వేయని వారంటూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఈ సాంగ్ కు కాలు కదిపినవారే. సోషల్ మీడియాలో రీల్స్ పేరుతో నాటు నాటు సాంగ్ ఫుల్ పాపులర్ అయ్యింది. దాంతో ఈపాట వరల్డ్ వైడ్ గా ఒక ఊపు ఊపేస్తోంది. ఈక్రమంలో మరో సెలబ్రిటీ ఈ సాంగ్ కు స్టెప్పులేసి అందరిని ఆకర్శించారు. ఈ సాంగ్ ఒరిజినల్ వీడియోలో అదరిపోయేలా స్టెప్పులేసిన రామ్ చరణ్ అత్త ఈ పాటకు కాలు కదిపారు.  

 

ఈ పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా స్టెప్పులేశారు. తన పక్కన ఉన్న మరో  మహిళతో కలిసి ఆమె కాలు కదిపారు. ప్రస్తుతం శోభన దావోస్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ స్టెప్పులు చూసిన రామ్ చరణ్  ఎంతో గర్విస్తున్న అత్తయ్య అంటూ కామెంట్ కూడా చేశారు.

గ‌త ఏడాది విడుద‌లైన రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ RRR సినిమా ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన ఈ చిత్రం ఇప్పుడు అవార్డుల రేసులోనూ ప‌రుగులు తీస్తుంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి దుమ్ము రేపిన సాంగ్ నాటు నాటు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా రిలీజ్‌కు ముందే ఇటు మెగా, అటు నంద‌మూరి అభిమానులు, సెల‌బ్రిటీలు నాటు నాటు సిగ్నేచ‌ర్ స్టెప్ వేసి సోష‌ల్ మీడియాను షేక్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios