ఈ ఏడాది రామ్‌ చరణ్‌, ఉపాసనలు తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే అందుకు కారణాలు వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్  చేసింది.

ఈ నెల జూన్‌ 14న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసనల పెళ్లి రోజు. ప్రతీ ఏటా ఈ రోజును చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు ఈ మెగా కపుల్‌. ఎక్కువగా విదేశాలకు వెళ్లటం చరణ్‌, ఉపాసనలకు అలవాటు. అయితే ఈ ఏడాది మాత్రం ఎలాంటి సెలబ్రేషన్‌ లేకుండా సాధాసీదాగా ఆ రోజును గడిపేశారు. అందుకు కారణం ఏంటో వివరిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. ఆ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

`గత 20 రోజులుగా మేం ఎమోషనల్‌గా చాలా ఇబ్బంది పడ్డాం. మా కుటుంబంలో ముగ్గురు పెద్దవాళ్లను కోల్పోయాం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వార్త కలచి వేసింది. కరోనా తీవ్రత పెరగటం, బార్డర్‌లో సైనికులు దేశం కోసం ప్రాణాలు విడవటం బాధించింది. సరిగ్గా వారం రోజుల క్రితం మా ఎనిమిదవ పెళ్లిరోజు, కానీ మేం ఆ రోజును సెలబ్రేట్‌ చేసుకునే మూడ్‌లో లేం. ఆ రోజు మేం మూడు రకాల ఆవకాయ పచ్చడ్లు, చిప్స్‌తో అన్నం తిన్నాం. టీవీ చూశాం.` అంటూ ఓ సుధీర్ఘ పోస్ట్ ను షేర్ చేసింది ఉపాసన.

ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇంటికే పరిమితమైన చెర్రీ ఎక్కువ సమయం భార్యతో కలిసి గడుపుతున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

View post on Instagram