మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్‌ ఉపాసన మరో కొత్త బాధ్యతలు తనపై వేసుకున్నారు. ఫారెస్ట్ ఫ్రంట్‌లైన్‌ హీరోస్‌ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్‌ ఉపాసన మరో కొత్త బాధ్యతలు తనపై వేసుకున్నారు. ఫారెస్ట్ ఫ్రంట్‌లైన్‌ హీరోస్‌ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. వరల్డ్ వైల్డ్ లైఫ్‌ ఫండ్‌ ఇండియా అసోసియేషన్‌ తరఫున ఆమె ఈ కొత్త బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఉపాసన ప్రకటించారు. 

దీనిపై ఉపాసన స్పందిస్తూ, `ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ క్షేత్ర సిబ్బంది కఠిన వాతావరణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. అడవుల్లో పెట్రోలింగ్‌ చేయడానికి సగుటున రోజుకి 15 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తూ, అడవి జంతువులను, వేటగాళ్లను ఎదుర్కొనే సమయంలోనే ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ఫారెస్ట్ ఫ్రంట్‌ లైన్‌ హీరోల రాయబారిగా పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాను` అని తెలిపింది. 

Scroll to load tweet…