సుకుమార్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ హాట్ సమ్మర్,, కూల్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తున్న చెర్రీ-ఉపాసన ఏడు గంటలపాటు నాన్ స్టాప్ ట్రెకింగ్ చేసి చాలా కేలరీలు కరిగిచ్చారట 

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ ఇప్పుడు రెండు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే.. నిర్మాతగానూ మారారు. ఇటీవల ‘ధృవ’తో కథానాయకుడిగా, ‘ఖైదీ నెంబర్‌ 150’తో నిర్మాతగా ఘనవిజయాలను అందుకున్నారు. ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చరణ్‌.. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాను నిర్మిస్తున్నారు.

సుకుమార్‌ సినిమా కోసం మండుటెండల్లో గోదావరి జిల్లాలో షూటింగ్‌లో పాల్గొన్నారు చెర్రీ. ఇప్పుడు కాస్త బ్రేక్‌ దొరకింది. దీంతో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి లండన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా యూరప్‌లోని ఓ మంచుకొండపై భార్యతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దాదాపు ఏడుగంటలపాటు కష్టపడి ట్రెక్కింగ్‌ చేసి పర్వతశిఖరానికి చేరుకున్నారట. ఈ ట్రెక్కింగ్‌ ద్వారా ఎన్నో కేలరీలను కరిగించేశామని ఉపాసన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ షేర్ చేసింది.