అఖిల్ కాదు.. నిఖిల్ తో రాంచరణ్ పాన్ ఇండియా మూవీ.. రేపే అనౌన్స్మెంట్ ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, నిర్మాత విక్రమ్ రెడ్డి కలసి వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, నిర్మాత విక్రమ్ రెడ్డి కలసి వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్మాణ సంస్థలో కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సాహిస్తూ పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు నిర్మించాలనేది ప్లాన్.
ఇందులో భాగంగా వి మెగా పిక్చర్స్ సంస్థ నుంచి తొలి చిత్రానికి ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ నిర్మాణ సంస్థతో కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ సంస్థ కూడా జత కానుంది. వీరి కొలాబరేషన్ లో తొలి చిత్రాన్ని రేపు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది అని అధికారికంగా ప్రకటించారు.
ముందుగా రాంచరణ్.. అఖిల్ అక్కినేని హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అఖిల్ అక్కినేని మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా చరణ్ తో సన్నిహితంగా ఉంటారు. కానీ తాజా సమాచారం మేరకు అఖిల్ తో కాదు.. చరణ్ నిర్మించబోయే తొలి చిత్రం హీరో నిఖిల్ సిద్దార్థతో అని వార్తలు వస్తున్నాయి.
అద్భుతమైన పాన్ ఇండియా కథతో చరణ్.. నిఖిల్ హీరోగా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. రేపే ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీకి ప్రకటన రానున్నట్లు స్ట్రాంగ్ బజ్. నిఖిల్ ఆల్రెడీ కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో జోరుమీద ఉన్నాడు.