మెగా వారసుడి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తనకు పుట్టబోయే బిడ్డ కోసం చరణ్ తీసుకున్న నిర్ణయంతో.. ఫ్యామిలీతో పాటు.. ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ చరణ్ తీసుకున్న నిర్ణయం ఏంటీ..?
మెగా వారసుడి కోసం చిరంజీవి ఫ్యామిలీతో పాటు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఉపాసనను బంగారు బొమ్మలా చూసుకుంటున్నారు. ఉపాసన ప్రగ్నంట్ అయిన అప్పటి కంటే ముందు నుంచ బాగా బిజీగాఉన్నాడు రామ్ చరణ్. శంకర్ సినిమా షూటింగ్ కాని.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కాని.. ఆస్కార్ ఈవెంట్స్ కాని.. ఇలా వరుసగా బిజీగా ఉండటంతో ఉపాసనతో టైమ్ స్పెండ్ చేయలేక పోయాడు రామ్ చరణ్.
అయితే ప్రస్తుతం ఏడో నెల ప్రగ్నెంట్ గా ఉన్న ఉపాసన కోసం.. ఇక నుంచి టైమ్ కేటాయించాలి అని అనుకుంటున్నాడట రామ్ చరణ్. అందుకే ఇప్పటి నుంచి మరో మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని.. ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్. ఇప్పటి నుంచే ఉపాసనకు సపోర్ట్ గా.. ఆమెతో పాటు ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట చరణ్. ఇంకో రెండు నెలల్లో వారసుడు రానుండటంతో.. ముందు రెండు నెలలు.. బిడ్డ పుట్టిన తరువాత మరో నెల బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటున్నాడట చరణ్.
ఏ భార్య అయిన తన డెలివరీ టైమ్ లో ఎవరు పక్కన ఉన్నా.. లేకున్నా భర్త ఉండాలని కోరుకుంటారు. దాంతో ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఇంత ప్రేమ చూసిపిస్తున్న చెర్రీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. ఈసినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. రామ్ చరణ్ పేరు హాలీవుడ్ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. దాంతో త్వరలోనే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటూ హింట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈసినియా రెండు షెడ్యూల్స్ వరకూ పెండింగ్ ఉన్నాయి. అయితే ఈవి కంప్లీట్ చేసేలోపు.. వారసుడు పుట్టబోతున్నాడు. అయితే ఈ షెడ్యూల్ కూడా పెండింగ్ లో పెట్టి.. హ్యాపీగా భార్యతో సమయంఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్.
