లాక్ డౌన్ టైమ్‌లో అభిమానులు చేస్తూ అవిశ్రాంత సహాయం పట్ల ముగ్దుడైన చరణ్ తాజాగా వారికి థ్యాంక్స్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ లేఖని ట్విట్టర్ ద్వారా పోస్టర్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్ టైమ్‌లో అభిమానులు చేస్తూ అవిశ్రాంత సహాయం పట్ల ముగ్దుడైన చరణ్ తాజాగా వారికి థ్యాంక్స్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ లేఖని ట్విట్టర్ ద్వారా పోస్టర్ చేశారు. అలాగే అభిమానులు చేస్తున్న ఫోటోలను ఓ వీడియో రూపంలో మలిచి అభిమానులతో పంచుకుంటూ థ్యాంక్స్ చెప్పారు.
`అభిమానులు ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకిత భావానికి నా ధన్యవాదాలు` అని తెలిపాడు చరణ్.
ఈ సందర్బంగా అభిమానులు సైతం చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు తండ్రి చిరంజీవితో కలిసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సీజన్ అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చెర్రీ సరసన అలియాభట్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు చిరంజీవితో కలిసి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నెక్ట్స్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చరణ్.
