కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని అది వెంటాడుతుంది. ఇటీవల రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్ర బృందానికి కరోనా సోకి ఆందోళనకి గురి చేసింది. ఇటీవల స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కరోనా సోకింది. అయితే ఆమె కూడా హెల్దీగానే ఉన్నట్టు వెల్లడించింది. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కి కరోనా సోకింది. ఆయన టెస్ట్ చేయించుకోగా కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. అయితే తనకు కరోనా లక్షణాలేవి కనిపించడం లేదని తెలిపారు. తనని టచ్‌లో ఉన్న వారి జాగ్రత్త పడాలని, టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. 

రామ్‌చరణ్‌కి కరోనా సోకడంతో ఇప్పుడు ఆ ఇద్దరికి పెద్ద టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా పెద్ద షాక్‌కి గురయింది `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `ఆర్ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసినటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ఆపివేసే పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఎన్టీఆర్‌, రాజమౌళి, ఇతర ముఖ్య నటులు కూడా టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. అంతా హోం క్వారంటైన్‌ వెళ్ళి పోవాలి. ఇప్పటికే అనేక వాయిదాలతో మూడు సార్లు విడుదల వాయిదాలు వేసుకుంది టీమ్‌. ఇప్పుడు చరణ్‌కి కరోనాతో విడుదలపై సస్పెన్స్ నెలకొంది. 

మరోవైపు రామ్‌చరణ్‌కి కరోనా అని తెలియడంతో మెగా ఫ్యామిలీ ఉలిక్కి పడింది. ఇటీవల మెగా ఫ్యామిలీ కలిసి క్రిస్మస్‌ సెలబ్రేట్‌  చేసుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, సాయితేజ్‌, శిరీష్‌, కొత్త పెళ్లి జంట నిహారిక, చైతన్య, వరుణ్‌ తేజ్‌ ఇలా ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడందరూ హోం క్వారంటైన్‌ కావాల్సి ఉంది. అంతేకాదు ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. వారంతా టెన్షన్‌ పడుతున్నారు. రామ్‌చరణ్‌ వల్ల ఎవరెవరికి కరోనా సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. 

మరోవైపు అభిమానులు షాక్‌కి గురవుతుంది. వారిలో ఆందోళన పెరిగింది. రామ్‌చరణ్‌ వల్ల అటు `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌, ఇటు మెగా ఫ్యామిలీలో విపరీతమైన టెన్షన్‌ నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో సీఎం, నాగార్జునతో సహా యావత్‌ రాష్ట్రమే ఉలిక్కి పడింది. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకోగా నెగటివ్‌ అని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  చరణ్‌కి కరోనా సోకిందన్న వార్త తెలిసి సినీ ప్రముఖులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని విషెస్‌ తెలియజేస్తున్నారు.