ఆ బాధతో చాలా రోజులు రూమ్ నుండి బయటకి రాలేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 16, Aug 2018, 12:26 PM IST
Ram Charan Talks About His Flop Movies
Highlights

అపజయం అనేది మనకు చాలా నేర్పిస్తుంది. అది మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనే చెప్పాలి. నా కెరీర్ లో ఒక దశలో వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. నా బెడ్ రూమ్ నుండి చాలా రోజులు బయటకి రాలేదు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా రూమ్ లోకే తెచ్చిపెట్టేవారు. అమ్మ మాత్రమే నా గదిలోకి వచ్చేది

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. చిరంజీవి తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో అలాంటిది తనకేం కష్టాలు ఉంటాయని అనుకుంటుంటారు. కానీ తనకున్న బాధతో చాలా రోజులు రూమ్ నుండి బయటకి రాలేదట రామ్ చరణ్. ఈ విషయాలను స్వయంగా అతడే చెప్పుకొచ్చాడు. 'అపజయం అనేది మనకు చాలా నేర్పిస్తుంది. అది మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనే చెప్పాలి.

నా కెరీర్ లో ఒక దశలో వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. నా బెడ్ రూమ్ నుండి చాలా రోజులు బయటకి రాలేదు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా రూమ్ లోకే తెచ్చిపెట్టేవారు. అమ్మ మాత్రమే నా గదిలోకి వచ్చేది' అంటూ గుర్తుచేసుకున్నాడు. 'ధ్రువ', 'రంగస్థలం' వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని నటుడిగా దూసుకుపోతున్నాడు.

రంగస్థలం సినిమాలో చరణ్ నటనకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోయారు. నటుడిగా అతడి స్టామినాను నిరూపించిన సినిమా అది. ఇక ప్రస్తుతం చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 

loader