ప్రభాస్ సవాల్‌ని తీసుకున్న రామ్‌చరణ్.. తనకిష్టమైన రిసిపీ చెబుతూ రానాకి ఛాలెంజ్..
అనుష్క.. ప్రభాస్‌ని బుక్ చేస్తే.. డార్లింగ్ రామ్ చరణ్‌ని బుక్ చేశాడు. రెసిపీ ఛాలెంజ్ పై తాజాగా మెగా పవర్ స్టార్ స్పందించాడు. రానాని బుక్ చేస్తూ తనకిష్టమైన రెసిపీని వెల్లడించారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రెసిపీ ఆట సాగుతుంది. ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంట్, ఆ తర్వాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటివి చాలా పాపులర్ అయ్యాయి. తాజాగా అనుష్క కొత్త ఛాలెంజ్‌కి తెరలేపింది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` పేరుతో రెసిపీల ఛాలెంజ్‌ని తెరపైకి తీసుకొచ్చింది. సినిమాలో ఆమె చెఫ్‌గా నటిస్తుంది. అనేక రుచికరమైన రెసిపీలను చేస్తుంది. నోరూరిస్తుంది. అయితే తను సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతుంది. దీంతో రెసిపీ ఛాలెంజ్‌ని విసురుతుంది. ఈ రకంగా ప్రమోషన్స్ పెంచే ప్రయత్నం చేస్తుంది.
తనకిష్టమైన రెసిపీ చెబుతూ ప్రభాస్‌కి ఛాలెంజ్‌ని విసిరింది. దానికి ప్రభాస్ రియాక్ట్ అవుతూ రొయ్యల పులార్ వంటకం తనకిష్టమని తెలిపారు. ఎలా తయారు చేయాలో తెలిపారు. ఆయన మరో స్టార్, ఫ్రెండ్ రామ్‌చరణ్‌కి ఈ ఛాలెంజ్‌ని విసిరాడు. దీంతో డార్లింగ్ సవాల్‌ని తీసుకున్న రామ్‌చరణ్.. తనకిష్టమైన వంటకం గురించి బయటపెట్టారు. తనకు నెల్లూరు చాపల పులుసు ఇష్టమని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలిపారు. ట్విట్టర్(ఎక్స్) ద్వారా పోస్ట్ చేశారు. తనకిష్టమైనది నెలూరు చేపల పులుసు అని తెలిపారు. ఈ సవాల్‌ని రానా దగ్గుబాటికి విసురుతున్నట్టు, ఈ ఫన్నీ ఛాలెంజ్‌లో ఆయన జాయిన్ కావాలని తెలిపారు. అదే సమయంలో `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలియజేస్తూ పోస్ట్ చేశారు.
అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంలో నటిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత అనుష్క థియేటర్లోకి వస్తుంది. దీంతో ఒకింత క్రేజ్ నెలకొంది. మరోవైపు నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తుండటంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం రేపు గురువారం(సెప్టెంబర్ 7)న విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది.