శర్వానంద్‌  కొత్త సినిమా అప్‌డేట్‌ కూడా వచ్చింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాకి టైటిల్‌ని ప్రకటించారు. దానికి `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే పేరుని ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుండటం విశేషం. మరోవైపు శర్వానంద్‌కి అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్‌చరణ్‌ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

శర్వానంద్‌ శనివారం(మార్చి 6) తన 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సర్‌ప్రైజ్‌లు వచ్చేశాయి. `శ్రీకారం` ట్రైలర్‌ సందడి చేస్తుంది. మరో సినిమా `మహాసముద్రం` ఫస్ట్ లుక్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. బర్త్ డే సీడీపీ వైరల్‌ అవుతుంది. దీంతోపాటు తన కొత్త సినిమా అప్‌డేట్‌ కూడా వచ్చింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాకి టైటిల్‌ని ప్రకటించారు. దానికి `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే పేరుని ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుండటం విశేషం.

Scroll to load tweet…

మరోవైపు శర్వానంద్‌కి అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్‌చరణ్‌ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మిడ్‌నైట్‌ బర్త్ డే పార్టీ చేశారు. శర్వా చేత కేక్‌ కట్‌ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను శర్వానంద్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `థ్యాంక్యూ చరణ్‌. బర్త్ డేని ఇంత గొప్పగా చేసినందుకు` అని శర్వానంద్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నిర్మాత విక్కీ కూడా ఉన్నారు. రామ్‌చరణ్‌, శర్వానంద్‌ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. 

Scroll to load tweet…