మహేష్ కూతురు సితారకు చరణ్ చెప్పిన మాట!

First Published 21, Jul 2018, 10:41 AM IST
ram charan suggestion to mahesh babu's daughter sitara
Highlights

రామ్ చరణ్ కుటుంబానికి మహేష్ బాబు కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రెండు ఫ్యామిలీలు కలిసి టూర్లకు కూడా వెళుతుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార నిన్న(జూలై 20) జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా కేక్ కట్ చేసిన సితార ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు సితారకు శుభాకాంక్షలు చెప్పారు.

అయితే చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు కూడా శుక్రవారమే కావడంతో సితార ఓ వీడియో ద్వారా 'ఉప్పి ఆంటీ హ్యాపీ బర్త్ డే' అంటూ శుభాకాంక్షలు చెప్పింది. ఇద్దరి పుట్టినరోజు ఒక్కరోజే కావడంతో రామ్ చరణ్ సంతోషిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఉపాసన, సితారలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ ఇద్దరి పుట్టినరోజు ఒకేరోజు కావడం విశేషం అంటూ చెప్పిన చరణ్ అప్పుడప్పుడు తన సినిమా పాటలను కూడా వినాలంటూ సితారకు సూచించారు.

సితార.. మహేష్ బాబు సినిమాలో పాటలు వింటూ వాటికి గుక్కతిప్పుకోకుండా పాడుతుంటుంది. అందుకే చరణ్ తన సినిమా పాటలను కూడా వినాలంటూ చెప్పాడు. రామ్ చరణ్ కుటుంబానికి మహేష్ బాబు కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రెండు ఫ్యామిలీలు కలిసి టూర్లకు కూడా వెళుతుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. 

loader