రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నా ట్రైలర్స్ లో అంతరిక్షం ఒకటని ఇంత మంచి సినిమాను తమకు అందిస్తున్న చిత్ర యూనిట్ ప్రత్యేక కృతజ్ఞతలని సినిమా కోసం అభిమానుల లగే తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

అదే విధంగా దర్శకుడు సంకల్ప్ గురించి మాట్లాడుతూ ఆయన సైజ్ కి విజన్ కి అసలు సంబంధం లేదు అని తానెప్పుడూ చెప్పేది ఒక్కటే అని మనిషి కన్నా గొప్పది ఒక ఆలోచన అలాంటి ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడు దిగజారారు. వారు చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. అది సినిమా ఇండస్ట్రీ అవని ఇక పాలిటిక్స్ లో అవని ఆలోచన బావుండాలి. 

రాజమౌళి - సుకుమార్ - క్రిష్.. అలాంటి గ్రేట్ విజనరీ ఉన్న మన దర్శకులొ సంకల్ప్ ఉండాలని వారి కన్నా గొప్ప స్థాయిలో ఉండాలని రామ్ చరణ్ మాట్లాడారు. ఇక బాబాయ్ ఉదయాన్నే చెప్పిన మాటలు నాలో ఒక ఉత్తేజాన్ని కలిగించాయని వరుణ్ తేజ్ ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉండడం చూస్తుంటే ప్రతి సారి అతని ఎంపిక విధానం ఆశ్చర్యపరుస్తున్నాయని వరుణ్ సినిమాలు చూసి కొన్ని సార్లు ఆనందపడ్డాను - మరికొన్ని సార్లు అసూయపడ్డాను ఇప్పుడు జలస్ గా ఉందని చరణ్ అన్నారు. 

తప్పకుండా సినిమా డిసెంబర్ 21న రిలీజయ్యి ఈ సినిమా అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ సభ్యులందరికి చరణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.