యువర్ లైఫ్ ఇన్నోవేటివ్ తరుపున నిర్వహించే ఈ ఆన్ లైన్ షో ని రామ్ చరణ్ హోస్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ షోలో ప్రభుదేవా, ఫర్హాఖాన్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఈ రోజున తన ఇనిస్ట్రగామ్ లో ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
రీసెంట్ గా రామ్ చరణ్ భార్య ఉపాసన..ఓ యూనిక్ డాన్స్ షో ను ఫిజికల్లీ,మెంటల్లీ ఛాలెంజెండ్ పీపుల్ కోసం నిర్వహించబోతున్నట్లు తెలియచేసిన సంగతి తెలిసిందే. యువర్ లైఫ్ ఇన్నోవేటివ్ తరుపున నిర్వహించే ఈ ఆన్ లైన్ షో ని రామ్ చరణ్ హోస్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ షోలో ప్రభుదేవా, ఫర్హాఖాన్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఈ రోజున తన ఇనిస్ట్రగామ్ లో ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
దివ్యాంగులైన సోదర,సోదరీమణులను ఉద్దేశిస్తూ ఈ వీడియో సాగింది. డాన్స్ మీద ఆసక్తి ఉండి, చేయగలిగే వారి ఎంట్రీలను అక్టోబర్ 15లోపల పంపమని ఈ వీడియోలో ఉంది. అలాగే చరణ్ ఇప్పటికే కొన్ని టాలెంటెడ్ డాన్సర్స్ వీడియో చూసానని చాలా ఇంప్రెస్ అయ్యానని అన్నారు. డాన్స్ తన హృదయానికి, తన కుటుంబానికి , తన అభిమానులకు సంవత్సరాలుగా చాలా దగ్గరగా ఉంటూ వస్తోందని వ్యాఖ్యానించారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చూసుకుంటూనే ఈ తరహా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె తాజాగా యువర్ లైఫ్ పేరుతో ఒక ఆన్ లైన్ వెబ్ సైట్ మొదలుపెట్టారు. అందులో స్టార్ నటి సమంతతో కలిసి బాడీ, మైండ్, హీల్, పోషకాహారం అనే నాలుగు ముఖ్యమైన అంశాల గురించి అనేక విషయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. అంతేకాదు కరోనా జాగ్రత్తలను కూడ వివరిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
అందులో భాగంగానే ‘మన ఊరు మన బాధ్యత’ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి దాని లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. దివ్యాంగుల్లో ఉన్న డ్యాన్స్ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి హీల్ యువ లైఫ్ త్రు డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటే ప్రముఖ కొరియోగ్రఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్ సైతం షోలో పాల్గొంటారు.
