రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చినట్టుంది. రామ్ చరణ్ కోసం స్సెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు టీమ్. ఈ పాట స్పెషల్ ఏంటంటే..?  

రామ్ చరణ్ ‌, కియారా అద్వాని జంటగా.. సౌత్ స్టార్ సీనియర్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న Rc15 మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. పెడ్డింగ్ లో ఉన్న ఇంపార్టెంట్ పెండింగ్ షూట్స్ ను కంప్లీట్ చేసుకుంటున్నారు టీమ్. ఈక్రమంలోనే రామ్ చరణ్ కు సబంధించిన స్పెషల్ సాంగ్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట టీమ్. సినిమా మొత్తానికి చాలా ఇంపార్టెంట్ సాంగ్ కావడంతో.. ఈసాంగ్ ను కొన్ని దేశాల్లో.. తగినట్టుగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. 

ఇక ఈ సాంగ్ కోసం స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవను రంగంలోకి దింపాడట శంకర్. అసలు ప్రభుదేవ పెద్దగా కొరియోగ్రఫీ చేయడం లేదు. డైరెక్టర్ గా.. యాక్టర్ గా అటు బాలీవుడ్ లో.. ఇటు సౌత్ లో రాణిస్తున్నాడు ప్రభుదేవ. అయితే ఈపాట కోసం స్పెషల్ గా ప్రభుదేవను అడిగాడట శంకర్. ఇక ఇప్పటి వరకూ రామ్ చరణ్ కు శేఖర్ మాస్టర్ ఎక్కువ పాటలు చేశాడు. ఆయనతో పాటు ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటివారు ఎక్కువ పాటలు చేశారు. ఇక ప్రభుదేవ కొరియోగ్రాఫీలో చరణ్ డాన్స్ ఎలా ఉంటందా అని ఫ్యాన్స ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటిచే చాలా వరకూ షూటింగ్ అయిపోయిన ఆర్ సీ 15 సినిమాలో శంకర్ రామ్ చరణ్ సినిమాన పరుగులు పెట్టిస్తున్నాడు. అటు కమల్ హాసన్ తో భారతీయుడు2 షూటింగ్ చేస్తూనే.. ఇటు చరణ్ సినిమాకు కూడా టైమ్ కేటాయిస్తున్నాడు. రెండు సినిమాలు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ కు కాస్త ఇబ్బందే అనుకోవాలి. ఈక్రమంలోనే చరణ్ మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. భారతీయుడు2 షూటింగ్ ను నిదానంగా చూసుకోవచ్చు అనుకుంటున్నాడట. 

ఇక రామ్ చరణ్ జోడీగా కియారా అద్వాని నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, అంజలీ, సునిల్, ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా క్రేజ్ తో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ హిట్ తరువాత ఆచార్యతో దెబ్బతిన్న మెగా పవర్ స్టార్.. ఈసినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలి అని చూస్తున్నాడు. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈసినిమాకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.