హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సినిమా తెలుగులో ఏ స్థాయిలో రిలీజ్ అవుతుందో  అదే తరహాలో బాలీవుడ్ లో కూడా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ బిగ్ ప్లాన్స్ తో రెడీ అవుతున్నాడు. 

సైరా సినిమాను హిందీలో లో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఫర్హాన్ అక్తర్ రిలీజ్ చేస్తున్నారు. అయితే మినిమమ్ హిందీలో 2000 స్క్రీన్స్ లలో సైరా చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ రామ్ చరణ్, ఫర్హాన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఏరియాల్లో మెగాస్టార్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కానుందని చెప్పవచ్చు. అయితే హిందీలో సినిమాకి బజ్ అనుకున్నంతగా లేదు. 

అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచేందుకు రెడీ అవుతోంది. స్పెషల్ గా అమితాబ్ బచ్చన్ ప్రమోషన్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సైరా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క - తమన్నా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.