పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ముఖ్యంగా రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయికి  చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు చెర్నీ.. ఈ సందర్భంగా సరికొత్త ఫొటోను షేర్ చేశాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తాజాగా నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ భారీ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ పొందుతోంది. బాక్సాఫీసు వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. దాదాపుగా నాలుగేండ్ల పాటు ప్రేక్షకులకు వెయిట్ చేయించిన ఈ మల్టీస్టారర్ చిత్రం చివరిగా బిగ్గేస్ట్ విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. టాలీవుడ్ బడా స్టార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఆడియెన్స్ కూడా RRRను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి రెండు వారాలు పూర్తయినా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్సాన్స్ ను అందుకుంటోంది. అయితే ఈ చిత్రం భారీ విజువల్స్ తో పాటు 3D వెర్షన్ లోనూ రిలీజ్ కావడంతో ఆడియెన్స్ కు సినిమా పట్ల మరింత ఆసక్తి నెలకొంది. 3డీ వెర్షన్ లో జక్కన చేసిన అద్భుతాన్ని వీక్షిస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ కూడా త్రీడీ వెర్షన్ లో ‘ఆర్ఆర్ఆర్’ను వీక్షించారు. ఈ సందర్భంగా ఓ క్రేజీ ఫొటోను తన అభిమానులతో పంచుకుని ఆర్ఆర్ఆర్ జోష్ ను మరింత పెంచేశాడు. 

ఈ ఫొటోల్లో బ్యాక్ డ్రాప్ లో టికెట్స్ ను చూపిస్తూ రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. అయితే ఈ పిక్ షేర్ చేసుకుంటూ ఆర్ఆర్ఆర్ 3డీ వెర్షన్ ను చూశారా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూడో వారంలోక అడుగుపెడుతోంది. చూడని వారుంటే త్వరగా చూసేయండి అని.. ఇందుకు టికెట్స్ ను పొందండి అంటూ తెలిపారు. మరోవైపు ఆడియెన్స్ కూడా RRR త్రీడీ వెర్షన్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాల్లో తొలిసారి ‘ఆర్ఆర్ఆర్’ 3డీ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. దీనికి ముందుకు రాణి రుద్రమాదేవి, ఓం 3డీ, రోబో 2.0 కూడా త్రీడీలో రిలీజ్ అయ్యాయి.

View post on Instagram